Advertisement
Navya Success story: ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది సాధించడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ సక్సెస్ దగ్గర కి వెళ్లి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. తొలి ప్రయత్నం లోనే సివిల్స్ కొట్టిన ఈమె గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు చిన్న వయసులోనే తొలి ప్రయత్నంలో సివిల్స్ క్రాక్ చేశారు. ఈమె సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ కొట్టడం అంత ఈజీ కాదు చాలామంది ఆహార్నిశలు తిండి మానేసి మరీ చదువుతూ ఉంటారు. 23 ఏళ్ల యువతి అసాధ్యన్నీ సుసాధ్యం చేశారు. తొలి ప్రయత్నం లోనే యూపీఎస్సీ లో ఆల్ ఇండియా 102 ర్యాంక్స్ సాధించారు. ఈమె పేరు నవ్య.
Advertisement
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ ఎగ్జామ్స్ ప్రతి ఏడాది జరుగుతూ ఉంటాయి లక్షల మంది ఈ పరీక్షలు హాజరవుతూ ఉంటారు పోటీ ఎక్కువగానే ఉంటుంది లక్షల్లో వుండే ఉద్యోగాలని అతికొద్ది మంది మాత్రమే సాధిస్తారు. యూపీఎస్సీ ని క్లియర్ చేయడానికి చాలా మంది ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అందరికీ సక్సెస్ రాదు. చండీగఢ్ కి చెందిన నవ్య ప్రాథమిక విద్య కూడా ఇక్కడే సాగింది 12వ తరగతి తర్వాత ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్ లో డిగ్రీ చేశారు ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేస్తూ యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు మొదటి అటెంప్ట్ లోనే సక్సెస్ ని అందుకున్నారు.
Advertisement
తొలి దేశ ప్రిపరేషన్ లో వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నారు వర్తమాన వ్యవహారాలకి సిద్ధం ఆగడానికి ఇది చాలా ముఖ్యమైన దశ యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించే ముందు మొదటి ప్రయత్నంలోనే పరీక్ష పాస్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీ లో మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించే విధంగా వ్యూహ రచన చేశారు రాత్రి నిద్ర పోయే ముందు ఉదయం చదివిన అంశాలని ఒకసారి రివిజన్ చేసుకోవాలని ఆమె చెప్తున్నారు. పుస్తకాలు సంఖ్యని పరిమితంగా ఉంచుకొని వాటిని తరుచు చదువుతూ ఉండాలని అన్నారు. ప్రిలిమ్స్ కి పుస్తకాలు సంఖ్య పరిమితంగా ఉండాలన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ ని క్లియర్ చేయాలంటే ఇదే ఫార్ములా అని అన్నారు ప్రిపరేషన్ కొద్దిగా పెరిగిన తర్వాత పాత సివిల్స్ పరీక్ష పేపర్ల నుండి సొంతంగా రాసుకోవాలని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!