Advertisement
మారి సెల్వరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్, సునీల్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో నటించారు. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.
Advertisement
నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్, సునీల్ రెడ్డి తదితరులు
దర్శకుడు : మారి సెల్వరాజ్
నిర్మాత : ఉదయనిధి స్టాలిన్
సంగీతం : ఏఆర్ రెహమాన్
విడుదల తేదీ: 14-07 -2023
కథ మరియు వివరణ:
తిమ్మరాజు (వడివేలు) ఒక చిన్న కార్యకర్తగా మొదట ఉంటాడు. ఆ తరవాత కష్టపడి ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే కొడుకు అయినా కూడా తన కొడుకు ఏ మాత్రం సిగ్గు పడకుండా పందుల వ్యాపారం చేస్తూ ఇండిపెండెంట్ గా ఉంటాడు కుమారుడు రఘువీర (ఉదయానిధి స్టాలిన్). వీళ్ళ మధ్య రాజకీయ విబేధాల రావడంతో ఇద్దరి నడుమ మాటలు ఉండవు. మరో పక్క లీల (కీర్తిసురేష్) ఫ్రీ కోచింగ్ క్లాసెస్ ని పెట్టడానికి ఒక చోటు కోసం వెతుక్కుంటూ వీర వద్దకు వస్తుంది.
Advertisement
తన ప్లేస్ ని కోచింగ్ సెంటర్ కింద పెట్టుకోమని చెప్తాడు. ఆ కోచింగ్ సెంటర్ మీద కొందరు రౌడీలు దాడి చేస్తారు. ఇక కథ మొత్తం మారిపోతుంది. వీరన్ తనకు తెలియకుండానే ఆ జిల్లా నాయకుడు అయిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్)తో గొడవకి దిగుతాడు. వీర-రత్నవేలు మధ్య ఫైట్ లో తిమ్మరాజు ఎలా నలిగిపోయాడు..? ఎవరు గెలుస్తారు..? ఇదే కథ.
ఈ సినిమాలోని నటీ నటులు బాగా నటించారు. సినిమాటోగ్రాఫర్ తెని ఈశ్వర్ మంచిగా సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. రెహమాన్ నేపధ్య సంగీతంలో కొత్తదనం కూడా బాగుంది. పాటలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అవ్వవు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడిగా మారి సెల్వరాజ్ మూడోసారి కూడా హిట్ కొట్టేసాడు. నో డౌట్.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
సంగీతం
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ
కొన్ని స్ట్రాంగ్ సీన్స్
మైనస్ పాయింట్స్:
కథనం & పాత్రలు తమిళ నేటివిటీలో ఉండడం
రేటింగ్ : 2.5/5
Also read: