Advertisement
హీరోయిన్ నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారని సోషల్ మీడియా ద్వారా తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఇద్దరు మగ పిల్లలు పుట్టడంతో వారికి ఉయిర్, ఉలగం అనే పేర్లు కూడా పెట్టినట్లు తెలిపారు. ఇకపోతే కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో మనోహరంగా, ఉజ్వలంగా ఉంది అని, తమ ప్రార్ధనలు, పూర్వీకుల దీవెనలతో తమకు అంత మంచి జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకోగా, ఈ నాలుగు నెలల్లోనే ఇద్దరు కవల పిల్లలకు సరోగసి పద్ధతి ద్వారా జన్మనిచ్చారు.
Advertisement
సరోగసి అంటే ఏమిటి?
కొన్ని ఆరోగ్య కారణాలవల్ల దంపతులకు సంతానం కలగనప్పుడు ఒక ఆరోగ్యవంతమైన మహిళను తమకు బదులు గర్భం దాల్చడానికి ఎంచుకోవటాన్ని సరోగసి అని అంటారు. ఈ ప్రక్రియ మహిళలు డబ్బులు తీసుకుని చేస్తారు. గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళను సర్రోగేట్ అని అంటారు.
Advertisement
అయితే, ఈ సరోగసి కారణంగా నయనతార జంట వివాదాల్లోకి చిక్కుకుంది. కనీసం పెళ్లి తర్వాత ఐదేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టక పోతే సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చేలా ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కానీ నయన్ విగ్నేష్ దంపతులు ఆ రూల్స్ ను బ్రేక్ చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసు నుండి బయటపడేందుకు నయనతార దంపతులు ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం. నయనతార పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన మహిళ దుబాయ్ లో ఉన్నారని, ఆమెకు నయనతార సోదరుడితో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అందువల్లే పిల్లలకు జన్మనిచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. అయితే దుబాయిలో సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం పై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో ఈ విషయం తమకు కలిసి వస్తుందని నయన్ దంపతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
read also : ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటను ఎందుకు దూరంగా ఉంచుతారు !