Advertisement
Nene Vasthunna Movie Review and Rating: మంచి పాపులారిటీ ఉన్న అతి కొద్ది మంది తమిళ నటుల్లో ధనుష్ ఒకరు. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో ఇక్కడ విడుదల అవుతూ ఉంటుంది. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘నానే వరువన్’. తెలుగులో ‘నేనే వస్తున్నా‘. సేల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇందుజా రామచంద్రన్, ఎలిసబెట్ అవ్రమిడౌ గ్రాన్లండ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను నిర్మించాడు. అయితే ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది.
Advertisement
Nene Vasthunna Review and Raitng: కథ & వివరణ
ప్రభు (ధనుష్) ది హ్యాపీ ఫ్యామిలీ. అతడిని చూసి తోటి ఉద్యోగి గుణ (యోగి బాబు) అసూయపడతాడు. మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య, దేవత లాంటి కుమార్తె ఉందని చెబుతాడు. అటువంటి ప్రభు ఫ్యామిలీలో పెను తుఫాను వస్తుంది. అమ్మాయి దెయ్యం ఆవహిస్తుంది. తన తండ్రి కథిర్ ను చంపితేనే అమ్మాయిని వదిలిపెడతానని దెయ్యం చెబుతుంది. ఆ కథిర్ ఎవరో కాదు ప్రభు కవల సోదరుడు. కవలలు ఇద్దరు ఎందుకు విడిపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? కన్న కుమార్తె కోసం అన్నయ్యను ప్రభు చంపాడా? లేదా? అసలు, ఈ అన్నదమ్ముల కథ ఏంటి? అనేది మిగతా సినిమా.
Advertisement
అయితే తాజాగా వచ్చిన ఈ చిత్రంలో ఈయన ద్విపాత్రాభినయం చేశారు. హీరోగా, విలన్ గా ధనుష్ కనిపిస్తారు. సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. సినిమాలో కనిపించే సన్నివేశాలు కాసేపు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ లో డెడ్ స్లో నేరేషన్ ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడుతుంది. హీరో స్టోరీ తో కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. సినిమాలో కొన్ని ట్విస్ట్ లు కొంతవరకు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ధనుష్ రెండు పాత్రల్లోనూ తన నటనతో కనబరిచాడు. ప్రతి నాయకుడు పాత్రలో జీవించేశారు ధనుష్. హీరోయిన్లు తమ పాత్రల మేరకు నటించారు. సేల్వ రాఘవన్ మరోసారి నటుడిగా తనదైన ముద్ర వేశారు. మరియు మిగిలిన నటీనటులు బాగా చేశారు.
ప్లస్ పాయింట్స్:
ధనుష్ నటన
ఊటీలోని సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
ఎమోషన్స్ లేకపోవడం
స్లో నరేషన్
రేటింగ్ 2.5/5
Read Also : మొహన్ బాబు మొదటి భార్య గురించి ఎవరీకి తెలియని టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా..?