Advertisement
ఈ ఆగస్టు 11న మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన బోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించిగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. సుశాంత్, రవిశంకర్, రావు రమేష్, తులసి, తరుణ్ అరోరా వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన బోళా శంకర్ చిత్రం ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
Advertisement
ఇక అసలు విషయానికి వస్తే .. తమిళంలో అజిత్ నటించిన వీరం సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ ని సొంతం చేసుకున్నారు. 2015లో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాను రీమేక్ చేసి భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి చిరు సైతం డిజాస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇలా అన్నదమ్ములు ఇద్దరు రీమేక్ చిత్రాలతో ఫ్లాప్స్ ను సొంతం చేసుకోవడంతోో నెటిజన్లు రీమేక్ సినిమాలతో కాకుండా సొంతంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
అయితే ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున హీరోగా నా సామిరంగ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ బిన్నీ దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. పొరింజు మరియమ్ జోస్ అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. దీంతో మెగా అభిమానులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ రీమిక్స్ సినిమాలు చేస్తే.. ఈ కాలంలో రీమేక్లు ఏంటి అంటూ మైకులో అరిగేలా మొత్తుకునే వాళ్లందరికీ పొరింజు మరియమ్ జోస్ అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా వస్తున్నా నా సామిరంగ సినిమా గురించి ఏం మాట్లాడడం లేదు ఎందుకో..? ఈ లాజిక్లన్నీ మెగా ఫ్యామిలీ హీరోలైతే గుర్తుకు వస్తాయా..? వేరే హీరోలకు వర్తించవా..? అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read :
సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఐకాన్ స్టార్.. ఇన్ స్టా లో రికార్డు క్రియేట్..!
ఊర్వశి రౌతెలా నిమిషానికి కోటి రూపాయలు పారితోషకం తీసుకుంటుందా..? నెటిజన్స్ ఏమన్నారంటే ?
పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు గురూజీ వలన డిజాస్టర్ గా నిలిచిన చిరంజీవి సినిమా అదేనా ?