Advertisement
న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి టెస్ట్ లో ఇండియా 25 పరుగులు తేడాతో ఓడిపోయింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 121 పరుగులకే అవుట్ అయిపోయింది. మూడు టెస్టుల సిరీస్ ని న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. 91 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ సిరీస్ లో ఇండియా వైట్ వాష్ కి గురవడం ఇది మొదటిసారి. అయితే గౌతమ్ గంభీర్ ని టీమిండియా టెస్ట్ క్రికెట్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ వినపడుతోంది.
Advertisement
T20, వన్డే ఫార్మాట్ కి మాత్రమే గంభీర్ ని కోచ్ గా ఉంచి టెస్ట్ బాధ్యతలు లక్ష్మణ్ కి ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి. గంభీర్ తో కంపేర్ చేసి చూస్తే లక్ష్మణ్ కి అపారమైన అనుభవం ఉంది. అందుకని ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గంభీర్ 58 టెస్టులు ఆడాడు. లక్ష్మణ్ చూస్తే 134 టెస్ట్ మ్యాచ్లు ఆడారు.
Advertisement
Also read:
టెస్టుల్లో ప్రతికూల పరిస్థితుల నుంచి జట్టును ఆదుకోవడంలో ఆయనకి గొప్ప అనుభవం ఉంది అందుకనే గంభీర్ ప్లేస్ లో లక్ష్మణ్ ని కోచ్ గా పెట్టాలని డిమాండ్ వినపడుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్యాసేనకు కోచ్ గా లక్ష్మణ్ ఉన్నారు ఇంకో పక్క ఆస్ట్రేలియా తో బోర్డర్ ట్రాఫి ముగిసిన తర్వాత గంభీర్ పనితీరుపై బీసీసీఐ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇది చూడండి!