Advertisement
పెళ్లయిన కొత్తలో దంపతులు హ్యాపీగా ఉంటారు. జీవితంలో మార్పులు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో బరువు కూడా పెరుగుతుంటారు. చాలామంది ఇదే విషయం చెబుతారు. పెళ్లయితే బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే వివాహం అయిన తర్వాత జంటలు బరువు ఎందుకు పెరుగుతారు? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట. పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి డైట్ పై పూర్తిగా దృష్టిపెడతారు. కఠిన వ్యాయామాలు చేస్తారు. నడవడం, యోగా వంటివి చేస్తుంటారు. తద్వారా పెళ్లి రోజున మంచి రూపంలో ఉంటారు.
Advertisement
READ ALSO : Dasara Movie Dialogues: నాని ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!
అయితే, వివాహ ఆచారాలు ప్రారంభమైన వెంటనే.. అమ్మాయి, అబ్బాయిలకు సమయం ఉండదు. ఈ పరిస్థితి వివాహం తర్వాత దాదాపు ఒక నెలపాటు ఉంటుంది. దీని కారణంగా కూడా కొత్త జంట బరువు పెరుగుతారని టాక్. వివాహానికి సంబంధించి హిందూ సంప్రదాయంలో అనేక ఆచారాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక స్పెషల్ చేస్తుంటారు. ఇక వంటకాలు కూడా అంతే. నెయ్యి, నూనె, పంచదారతో వంటకాలు బోలెడు చేస్తారు. చేసిన వంటకాలను వధూవరులకు టేస్ట్ చేయించాల్సిందే. ఆ కారణంగా కూడా వారు బరువు పెరుగుతారు.
Advertisement
READ ALSO : DASARA MOVIE DIALOGUES: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!
వివాహం తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కొత్త జంటను తమ తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. ఈ సమయంలో రకాల ఆహారాలు తింటారు. అది శరీరంలో కొవ్వు పెరుగుదలకు కారణం అవుతుంది. ఇంకా ఎక్కువ సేపు కూర్చోవడం, కనీసం నడవలేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి సన్నాహల దాకా, పెళ్లి పనుల్లో కొత్తజంటలు బాగా అలసిపోతుంటారు. సంగీత్ వేడుకలు, మెహందీ, హల్దీ వేడుకల కారణంగా అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటారు. దాంతో నిద్రలేమి సమస్యతో బాధపడతారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.
READ ALSO : ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !