Advertisement
Newsense Web Series Review నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు వెబ్ సిరీస్ “న్యూసెన్స్”. ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ ప్రవీణ్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లో డిఫరెంట్ కంటెంట్ తో విడుదలైన ఈ సినిమా ఆహా ఓటిటి ద్వారా శుక్రవారం విడుదలైంది. ఈ న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: టాలీవుడ్ లో ఇప్పటి దాకా రావణుడి పాత్ర పోషించిన 6 నటులు…!
Newsense Web Series Review కథ మరియు వివరణ:
ఈ వెబ్ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు. 1990 – 2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని మదనపల్లి ప్రెస్ క్లబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మదనపల్లికి చెందిన శివ ( నవదీప్) ఓ జర్నలిస్ట్. రిపబ్లిక్ ఛానల్ లో పనిచేస్తూ ఉంటాడు. ఉదయం లేవగానే అరుగు మీద కూర్చుని తప్పకుండా న్యూస్ పేపర్ చదివే జనాలు.. టీవీలో న్యూస్ చూసి అదే నిజం అనుకునే అమాయకత్వపు ఆలోచనల చుట్టూ ఈ కథనం నడుస్తుంది. ఇక ఊళ్లోని సమస్యలని తన అవసరాలుగా మార్చుకుంటూ బతికేస్తూ ఉంటాడు శివ. నీతి, న్యాయాలతో పనిలేకుండా డబ్బు కోసం వార్తలని తనకు నచ్చినట్లుగా మార్చేస్తూ ఉంటాడు.
ఇక మదనపల్లిలో అధికార పార్టీ నాయకుడు కరుణాకర్ రెడ్డితో పాటు ప్రతిపక్ష లీడర్ నాగిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఇందులో శివతోపాటు అతడి మిత్రులు ఒక్కరికి మాత్రమే సపోర్ట్ చేయకుండా ఇద్దరికీ సపోర్ట్ చేస్తూ డబ్బులను గడిస్తుంటారు. అక్కడే లోకల్ ఛానల్ లో నీలా ( బిందు మాధవి) న్యూస్ రీడర్ గా ఉంటుంది. అయితే లోకల్ ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో కరుణాకర్ రెడ్డి కి ఫేవర్ గా మారిన శివ.. నాగిరెడ్డి చేసే అక్రమ దందాలను బయటపెడతాడు. ఈ వైరంలో ఎవరెవరు ఎలా బలయ్యారు..? సమాజంపై ఈ ప్రభావం ఎలా పడింది..? ఇందులో జర్నలిస్టులు శివ మరియు అతని టీం ఏం చేసింది..? చివరకు సమాజం దృష్టిలో జర్నలిస్టులు ఎలా చూడబడ్డారు అనేది ఈ సినిమా కథ.
Advertisement
ఇండస్ట్రీలో మీడియా రంగంపై వచ్చే సినిమాలు చాలా అరుదు. ఇప్పుడు ఇదే ఈ వెబ్ సిరీస్ పట్ల టాలీవుడ్ ప్రేక్షకులలో ఆసక్తి నెలకొనడానికి ప్రధాన కారణమైంది. ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా పనిచేసే మీడియా పనితీరు ఎలా ఉంటుంది..? జర్నలిస్టులు నిజాలే రాస్తున్నారా..? లేక వాళ్ళు రాసింది నిజమని జనాలు నమ్ముతున్నారా..? అనే అంశాల నేపథ్యంలో న్యూసెన్స్ సిరీస్ ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీ ప్రవీణ్. ఇందులో ప్రధాన పాత్రధారుల డైలాగ్స్ మొత్తం చిత్తూరు యాసలోనే వినిపిస్తూ ఉంటాయి. ఇందులో ఓ సీన్ చూసినప్పుడు నిజంగా జర్నలిస్టులు ఇంత రాక్షసంగా ఉంటారా అనే ఆలోచన వస్తుంది. ఇక డబ్బున్నోళ్లు మీడియాను కొనేస్తున్నారా..? అనే పాయింట్స్ చూపిస్తూ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా ముందుకు తీసుకువెళ్లారు. కథ మొత్తం ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. రిపీటెడ్ సీన్స్ వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. పొలిటికల్ సీన్స్ లో డ్రామా సరిగా పండలేదు. నవదీప్, బిందు మాధవి తప్ప మిగిలిన పాత్రధారుల యాక్టింగ్ చాలా చోట్ల ఆర్టిఫిషియల్ గా ఉంది.
ప్లస్ పాయింట్స్:
కథ
నవదీప్, బిందు మాధవి
బిజిఎం
మైనస్ పాయింట్స్:
రిపీటెడ్ సీన్స్
సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2.75/5
Read also: ఇలా కూడా ఉన్నారా.. ఇలాంటి పనులు చేస్తారా ? భర్త సంపాదన సరిపోవడం లేదని!