Advertisement
నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నిహారిక నిజానికి చైతన్యని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే ఈ జంట విడిపోవడంతో ఇండస్ట్రీలో సంచలనంగా ఈ విషయం మారింది. ఈ వార్తతో మెగా ఫ్యామిలీ లో మెగా ఆడపడుచులకి పెళ్లిళ్లు అసలు కలిసి రావా అని అంతా షాక్ అవుతున్నారు.
Advertisement
మెగా ఆడపడుచులకి పెళ్లిళ్లు కలిసి రాకపోవడంతోనే అందరూ విడాకులు తీసుకుంటున్నారు అని ప్రేక్షకుల్లో సందేహం కలుగుతోంది. చైతన్య నిహారిక కొన్నాళ్ల నుండి దూరంగా ఉంటున్నారు దాంతో వాళ్ళిద్దరూ విడిపోతారు అన్న వార్తలు ముందు నుండి వస్తున్నాయి. ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో అప్పుడు వచ్చిన వార్తలన్నీ కూడా నిజమని అర్ధమవుతోంది. అయితే వీళ్ళ విడాకులకి కారణం కుటుంబ సభ్యులు చేసిన తప్పు అని అంతా అంటున్నారు.
Advertisement
మరి మెగా ఫ్యామిలీకి దీంతో సంబంధం ఏంటి అనేది చూస్తే.. ప్రతి ఒక్కరు కూడా పెళ్లిని ఆచారం ప్రకారం చేస్తారు. ఈ రోజుల్లో చాలామంది వాటిని పాటించడం లేదు. దాంతో పెళ్లయిన తర్వాత సమస్యలు కలుగుతున్నాయి. పెళ్లికి ముందు వధూవరుల జాతకలని చూసి జాతకం కుదిరాక ముహూర్తాన్ని నిర్ణయిస్తారు.
ముహూర్తం ప్రకారం పెళ్లిని చేస్తారు. కానీ మెగా డాటర్ నిహారిక విషయంలో సుముహూర్తానికి పెళ్లి జరగలేదట పెళ్లి అయ్యేసరికి ముహూర్తం టైం దాటిపోయింది. దీంతో వీళ్ళ వైవాహిక జీవితంలో ఆటంకాలు కలుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.
Also read: