Advertisement
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ముఖేష్ అంబానీ 1985లో పెళ్లి చేసుకున్నారు. నీతా అంబానీ ని ప్రేమించి ముఖేష్ అంబానీ పెళ్లి చేసుకున్నారు. ముఖేష్ అంబానీ నీతా అంబానీ కారులో వెళ్తున్నప్పుడు కారు ఆపేసి ముఖేష్ అంబానీ ఆమెని పెళ్లి చేసుకుంటారా అని అడిగారంట. ముఖేష్ అంబానీ ప్రొపోజ్ చేశాక నీతా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు, ప్రపంచంలోనే తొమ్మిదవ ధనవంతుడైన ముఖేష్ అంబానీ ని నీతా అంబానీ పెళ్లి చేసుకున్నారు. నీతా అంబానీ నర్సి మోంజి కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Advertisement
Advertisement
కొన్నాళ్ళు టీచర్ గా పని చేశారు పెళ్లయిన తర్వాత కూడా ఆమె ఉపాధ్యాయురాలుగా కొనసాగించాలని భావించారు పెళ్లయిన తర్వాత తర్వాత సంవత్సరం సన్ఫ్లవర్ నర్సరీ అనే స్కూల్లో ఆమె ఉపాధ్యాయురాలుగా పని చేసారు. నెలకి రూ.800 ఇచ్చే వారట. ముఖేష్ అంబానీ కూడా ఈ విషయాన్ని ఒకసారి చెప్పారు. ముఖేష్ అంబానీ నెట్వర్త్ రూ. 11280 కోట్లట రిలయన్స్ ఫౌండేషన్ కి చైర్ పర్సన్ అలానే ఫౌండర్ కూడా. ఇక ఇప్పుడు రీసెంట్ గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు ఈ జంట. అనంత్, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్ నగర్ లో జరిగాయి.
మూడు రోజులు పాటు వీళ్ళ సెలబ్రేషన్స్ జరిగాయి. మార్క్ జుకర్ బర్గ్ ఇలా చాలామంది ప్రముఖులు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి అటెండ్ అయ్యాయి. కానీ నీతా అంబానీ ముఖేష్ అంబానీ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంత తక్కువ జీతంతో ఒక టీచర్ గా పని చేయడం అంటే గొప్ప విషయమే. ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ పెళ్లి చేసుకున్నాక ఆమె కావాలనుకుంటే ఏ పని చేయకుండా సంతోషంగా ఉండొచ్చు కానీ ఆమె అంత తక్కువ జీతానికి ఒక టీచర్ గా వర్క్ చేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!