Ads
కష్టాలు ఎప్పుడు వస్తాయనేది ఎవరు ఊహించలేము. అనుకోకుండానే మనకి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. దాంతో మనం ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ తల్లి కి వచ్చిన కష్టం ఏ తల్లికి కూడా రాకూడదు. విధి ఆడిన వింత నాటకంలో కన్న కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్ళి పోతే దుఃఖాన్ని దిగమింగుకొని తల కొరివి పెట్టింది తల్లి. తనకి తల కొరివి పెట్టాల్సిన కొడుకుకే తల కొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
Advertisement
ఇక వివరాల్లోకి వెళితే.. ఏపీ లోని కృష్ణా జిల్లాలో ఇది చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మెరకన పల్లి గ్రామానికి చెందిన పామర్తి ఝాన్సీ కొడుకు పామర్తి ప్రసాద్. అయితే అతను కొంత కాలం నుండి కూడా అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయారు. ఇద్దరు కూతుర్లు ఆయనకి ఉన్నారు. మగసంతానం లేరు దాంతో కన్న తల్లి తల కొరివి పెట్టింది. తలకొరివి పెట్టి అంత్యక్రియలు ని ఆమె నిర్వహించింది. ఏ తల్లికి కూడా ఈ కష్టం రాకూడదని ఇది చూసి ప్రతి ఒక్కరు అంటున్నారు.
Also read:
- వన్డే వరల్డ్‌కప్ టికెట్లు పై కీలక అప్‌డేట్.. ఎక్కడ బుక్ చేసుకోవచ్చు అంటే..?
- జనసేన తొలి అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్..!
- ఐఎండీబీలో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ‘బ్రో’ మూవీ..!