Advertisement
హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఈ సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నా కుటుంబ సమస్యలవి కూడా అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చి వేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మరుసటి రోజు ఆయన సోదరుడు తిరుపతిరెడ్డికి హైడ్రా నోటీసుల్ని పంపించింది. మాదాపూర్ లోని అమర్ కోపరేటివ్ సొసైటీలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఉంటున్నారు. ఈయన ఉంటున్న ఈ నివాసం దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు.
Advertisement
నెలలోపు అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రైతు రుణమాఫీ పై ప్రభుత్వం అసమర్ధతను పక్క తోవ పట్టించడానికి హైదరాబాద్ తో హైడ్రామా చేస్తున్నారని బీజేపీ విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హైడ్రా పేరుతో బెదిరిస్తూ పార్టీలోకి లాక్కోవాలని చూస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
Advertisement
Also read:
దమ్ముంటే హైడ్రా కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి సోదరులకు నోటీసులు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను కూల్చాలని డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉందని ఆ భవనాన్ని నెల రోజుల్లో కూల్చాలని హైడ్రా నోటీసులు ఇచ్చింది. తాజా పరిణామంలో హైడ్రా పనితీరు దూకుడు పై మరింత విశ్వసనీయత వ్యక్తం అవుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!