Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇంత బిజీగా ఉన్న టైం లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవబోతున్నారట. తాజాగా ఈ వార్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణాలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణాలో పర్యటనలు చేస్తూ సందడి చేస్తున్నారు.
Advertisement
ఈ క్రమంలో తెలంగాణాలో బిజెపిని బలపరచడం కోసం కేంద్రమంత్రులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ఇతర పార్టీలతో పొత్తులు ఏర్పరుచుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు. జనసేనలో పొత్తు చేసుకోవాలని ఇప్పటికే బిజెపి ప్రయత్నించింది. కానీ, పవన్ కళ్యాణ్ టీడీపీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలవబోతున్నారు అన్న వార్తా గుప్పుమనడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్తా చర్చనీయాంశం అయింది.
Advertisement
అసలు ఎన్టీఆర్ ను అమిత్ షా ఎందుకు కలుస్తున్నారు? అన్న విషయమై ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ప్రస్తుతం టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై కూడా ఎన్టీఆర్ ఏ విధంగానూ స్పందించలేదు. ఈ క్రమంలో వీరిద్దరి కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో మునుగోడు ఎన్నికల టైం లో కూడా అమిత్ షా నోవాటెల్ హోటల్ లో ఎన్టీఆర్ తో భేటీ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో, వీరిద్దరూ మరోసారి కలుస్తుండడంతో.. రాజకీయ పరమైన చర్చల కోసమే వీరిద్దరూ కలుస్తున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందుకు గల కారణానికి మాత్రం వీరిద్దరూ ఇప్పటివరకు వెల్లడించలేదు.
మరిన్ని..
సలార్ గురించి గూస్ బంప్స్ తెప్పించే నిజాలు.. ఆ ఒక్క సీన్ కోసం ఇంత చేస్తున్నారా?
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇంతటి ఘోరానికి ఒడిగట్టారు.. అసలేం జరిగిందో తెలిస్తే కన్నీళ్లే!
Sksanda Movie Mistake: స్కంద సినిమాలో ఈ బ్లండర్ మిస్టేక్ ని గమనించారా?