Advertisement
నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టింది అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, తెలుగు దేశం పార్టీ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఇప్పటివరకు తన వంతు సాయం అందిస్తూనే వచ్చాడు. కుటుంబ సభ్యులతో సఖ్యత లేకున్నా.. పార్టీ విషయంలో మాత్రం ఎన్టీఆర్ తన సాయం అందించారు. చివరకు ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన కొడాలి నాని పార్టీ వీడినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించారు. కట్టె కాలేవరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటానని తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి: గుడివాడలో టీడీపీ గెలుస్తుందా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
ఇవి కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ పై “సీ ఓటర్ సర్వే” లో సంచలన విషయాలు వెలుగులోకి..!
Advertisement
ఒక సామాన్య కార్యకర్తగా సేవలు అందిస్తానని తెలిపారు. ఆయన చెప్పినట్లే పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు స్పందించారు. అవసరం అన్న ప్రతిసారి ఆయన తన హస్తాన్ని అందించారు. అయితే.. ఒక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలోనే తారక్ స్పందించలేదు. అయితే ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి కూడా తారక్ కు ముందే తెలుసన్న వాదన వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: గురపత్వంత్ సింగ్ కి గూబ గుయ్యిమనిపించేలా బుద్ది చెప్పిన భారత్ ! దెబ్బ అదుర్స్ కదు !
గత ఏడాది తారక్ ను బిజెపి నేత అమిత్ షా పిలిపించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆయన నటనకు గాను అభినందించడానికి ఆయనను పిలిపించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ దాని అర్ధం వేరు అంటూ ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి అమిత్ షా తారక్ కు ముందుగానే చెప్పారని.. ఆ సమయంలో స్పందించవద్దు అంటూ తారక్ వద్ద నుంచి మాట తీసుకున్నారని ఈ వార్తల సారాంశం. ఆయనకు ఇచ్చిన మాట మేరకే.. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అసలు స్పందించడం లేదు ఈ వార్తల్లో పేర్కొంటున్నారు. అయితే వాస్తవాలు ఏంటో తెలియాల్సి ఉంది.