Advertisement
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి వాళ్ళు టాప్ హీరోలుగా రాణించారు. మంచి సూపర్ హిట్స్ సినిమాల్లో ఈ హీరోలు నటించారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ పెద్ద పెద్ద హీరోలుగా ఫేమస్ అయ్యారు. తెలుగు భారీ చిత్రాల నిర్మాత అనగానే మొదట మనకి గుర్తొచ్చేది వైజయంతి మూవీస్ అధిపతి అశ్విని దత్.
Advertisement
మూడు తరాల అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తెర మీదకి తీసుకువచ్చారు. అశ్విని దత్ ఓ సీత కథ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమాల్లోకి వచ్చారు. ఈ సినిమాకి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఆయన అభిమాని నటుడు ఎన్టీ రామారావు తో ఒక సినిమాని నిర్మించాలని అనుకున్నారు అందుకు ఆయన్ని సంప్రదించారు. శ్రీకృష్ణుని మెడలో ఉన్న మాలకి ఎన్టీఆర్ పేరుని పెట్టారు ప్రొడక్షన్ హౌస్ యొక్క లోగో లో ఎన్టీఆర్ శ్రీకృష్ణ భగవానుడిలా ఉండే చిత్రం ఉంటుంది.
Advertisement
ఎన్టీఆర్ చిరంజీవి లతో ఎక్కువ సినిమాలని ఈయన రూపొందించారు. చిరంజీవితో జగదేకవీరుడు, అతిలోకసుందరి, ఇంద్ర చూడాలని ఉంది మొదలైన బ్లాక్ మాస్టర్ హిట్స్ ని రూపొందించారు. బాలయ్యతో అశ్వమేధం అనే సినిమాని రూపొందించారు. ఒకసారి షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య మాట్లాడుకుంటున్నారు.
ఆ టైంలో చిరంజీవి ఖైదీ, పసివాడి ప్రాణం వంటి సినిమాలు చేసారు. బాలయ్య మంగమ్మగారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు వంటి సినిమాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య తో తరచు మాట్లాడేవారు అయితే ఆ సమయంలో సినీ పరిశ్రమ తరవాత మీ అల్లుడు చిరంజీవి, నా కొడుకు బాలయ్యదే అని చెప్పారట. ఆరోజు ఆయన చెప్పినట్లే ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ మంచి పొజిషన్లో ఉన్నారు పెద్ద హీరోలుగా పేరు తెచ్చుకున్నారు.
Also read: