Advertisement
జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజకీయాలపై మంచి పట్టు ఆయనకి ఉంది. 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆయన ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు కంగుతినేలా చేశారు. కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తర్వాత టిడిపిలో చోటు చేసుకున్న కలహాల వలన ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి కూడా కెరియర్ మీదనే దృష్టి పెట్టారు.
Advertisement
ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ ఆయన రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. తమిళనాడు ఎన్నికల టైం లో అక్కడ డిఎంకె పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్టీఆర్ ముందే ఊహించారు. ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు దర్శకుడు నటుడు సముద్రఖని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Advertisement
ఇక తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంటుందని, ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పేసారు. ఎన్టీఆర్ చెప్పినట్లుగానే తెలంగాణలో కాంగ్రెస్ ఘన పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకుంది తాజాగా ఏపీ రాజకీయాలపై కూడా ఎన్టీఆర్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారం చేజిక్కించుకుంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ చెప్పినవన్నీ జరుగుతుండడంతో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం కచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చూడాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!