Advertisement
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో కివిస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ బాగానే ఉన్నా బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా టీమ్ ఇండియా మీడియం పేసర్ షార్దుల్ ఠాగూర్ ఒక్క ఓవర్ లో భారత్ ఫలితాన్ని మార్చేశాడు. అతడు వేసిన 40 ఓవర్లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి. అప్పటివరకు ఇరు జట్లకు విజయవకాశాలు ఉండగా ఆ ఒక్క ఓవర్ తో మ్యాచ్ కివిస్ వైపు మళ్లీంది.
Advertisement
ఈ మ్యాచ్ ల్లో కివిస్ 39 ఓవర్లకు 216-3 స్కోర్ వద్ద ఉండగా ధావన్, శార్దూల్ కు బంతినిచ్చాడు. 40 వ ఓవర్ వేసిన శార్దూల్ బౌలింగ్ లో టామ్ లాతమ్, తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు. రెండో బంతి వైడ్, తర్వాత వరుసగా 4 ఫోర్లు. ఐదో బంతికి మళ్ళీ వైడ్. ఆరో బంతికి లాతమ్ సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Advertisement
ఈ ఓవర్లో మొత్తంగా 25 పరుగులు వచ్చాయి. 39వ ఓవర్ ముగిసేసరికి 70 బంతుల్లో 77 పరుగులతో ఉన్న లాతమ్, ఆరు బంతుల్లో 23 పరుగులు రాబట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈ ఓవర్ తర్వాత అతడు మరింత చెలరేగాడు. దీంతో మ్యాచ్ అనంతరం శార్దూల్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ‘అసలు ఇతడు మనకు తెలిసిన లార్డ్ కాదు’ అని కామెంట్స్ చేస్తున్నారు. శార్దూల్ ను అభిమానులంతా ‘లార్డ్’ అని పిలుచుకుంటున్నారన్న విషయం తెలిసిందే. మరి కొంత మంది, ‘సీఎస్కే నుంచి వెళ్ళాక లార్డ్ ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారుతుంది’, ‘లెగ్ సైడ్ ఒక్కడే ఫీల్డర్ ఉన్నా అటు దిశగా బంతులు వేసే ఏకైక బౌలర్ ఠాకూర్ మాత్రమే’, ‘మనం లార్డ్ ఠాకూర్ ను అంచనా వేయలేం. ఎందుకంటే అతడు ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు’, అని కామెంట్స్ చేస్తున్నారు.