Advertisement
హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలని, సంప్రదాయాలని పాటిస్తూ ఉంటారు. అయితే హిందూ సంప్రదాయంలో భాగంగా ఇంటి ఆడబిడ్డకు వివాహం చేసిన తర్వాత తనకి ఒడి బియ్యం పోసి అత్తవారింటికి పంపుతారు. ప్రతి సంవత్సరం తమ కూతురిని పుట్టింటికి పిలిచి తనకు ఒడిబియ్యం పోసి అత్తవారింటికి సారి కట్టి పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా అమ్మాయిలకు వడి బియ్యం పోయడం వెనక అర్థమేంటి..? ఎందుకు ఇలా చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచుని ఇలా ఏడాదికి ఒకసారి పుట్టింటికి రమ్మని పసుపు, కుంకుమ, గాజులు తనకి ఇష్టమైన దుస్తుల్ని పెట్టి నూరేళ్లు హాయిగా ఉండమని ఈ ఒడి బియ్యం కార్యక్రమం చేస్తారు. ఇది మాత్రమే కాకుండా ఒడి బియ్యం పోయడానికి ఇంకో కారణం కూడా ఉంది. మనిషి వెన్ను లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులు కలిసే చోట చక్రం ఉంటుంది. మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. మధ్యభాగంలో వడ్ఢియానా పీఠం ఉంటుంది.
Advertisement
Also read:
కనుక అమ్మాయిలు నడుముకు ధరించే ఆభరణాలని వడ్డానం అని పిలుస్తారు. అలాగే అమ్మాయిలకు వడి బియ్యం పోయడం అంటే వడ్ఢియానా పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం. ఈ పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి అందుకనే ఆడపిల్లల్ని ఇంటి మహాలక్ష్మి గా భావిస్తారు. తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని వడిబియ్యం అనంతరం ఆ వడి బియ్యం లో ఐదు పిడుకుల బియ్యం తీసుకునే తమ తల్లిదండ్రుల ఇంట్లో పెట్టి తన పుట్టింటి గడపకు పసుపు రాసి ఒడిబియ్యంతో అత్తవారింటికి బయలుదేరుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!