• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Published on December 17, 2022 by karthik

Advertisement

ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి హీరో, హీరోయిన్లుగా స్థిరపడిపోయారు. మరికొందరు మాత్రం అరకొరగా ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయారు. అయితే ఇప్పట్లో హీరోల చెల్లెలి పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కానీ.. అప్పట్లో మాత్రం హీరోకి చెల్లి ఉంది అంటే ఇక ఆ పాత్ర కోసం ఎంతో జాగ్రత్త పడుతూ కొంతమంది నటులని సెలెక్ట్ చేసేవారు. ఇలా హీరో చెల్లెలి పాత్రలో నటించి గుర్తింపు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో తీసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.

Read also: ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు మంచి కం బ్యాక్ ఇచ్చిన 10 సినిమాలు

Advertisement

అదే కోవలో ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలిగా చేసిన అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. విభిన్న కథా చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అప్పట్లో ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా భూమిక నటించిది. ఈ చిత్రంలో మహేష్ బాబుకి చెల్లిగా చేసిన అమ్మాయి చాలా సహజంగా నటించింది అన్న పేరు తెచ్చుకుంది. ఈ అమ్మాయి పేరు నిహారిక. ఈమె ఒక్కడు సినిమాకు ముందు మోహన్ బాబు హీరోగా చేసిన యమజాతకుడు అనే సినిమాలో మోహన్ బాబు కి మేనకోడలుగా చేసింది. అలాగే వెంకటేష్ హీరోగా ప్రేమించుకుందాం రా అనే చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

Mahesh Babu Okkadu Movie Child Artist Baby Niharika Present Life Story And Unknown Things In Telugu - Sakshi

 

ఆ తర్వాత నిహారికకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె చదువుకు ఇబ్బంది అవుతుంది అని ఆమె పేరెంట్స్ మళ్ళీ సినిమాలలో నటించడానికి అంగీకరించలేదు. దీంతో నిహారిక కూడా వచ్చిన అవకాశాలకు నో చెప్పి చదువులపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆమె తన చదువుని పూర్తి చేసుకొని మళ్లీ సినిమా అవకాశాల కోసం ఫోటో షూట్ చేసింది. ప్రముఖ దర్శకుడు నిహారికకు అవకాశం ఇస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Read also: రష్మికని అంతలా వేధించారా ? ‘కాంతార’ సినిమాకు ఆమెకు సంబంధం ఏంటి?

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd