Advertisement
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వ్యాఖ్యలకు ఎన్టీఆర్ చాలా ఆకర్షితులయ్యే వారు ఆయన చెప్పిన మాటలను ఆయన పఠనం చేస్తుండే వారట. ఆయన తెరమీద బొమ్మలే పాలను చేస్తాయి అని బ్రహ్మంగారి మాట ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించడంతో బ్రహ్మంగారి చరిత్రను సినిమాగా తీయాలని సంకల్పం చేసుకున్నారు. అనుకోగానే సినిమాను మొదలు పెట్టాలనుకున్నారు. ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాగా తీస్తాను అంటే కాదు అనే వాళ్ళు ఉంటారా..? అప్పటికే ఎన్నో మాస్ కమర్షియల్ ఐటం సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా జనానికి నచ్చుతుందా లేదా అని అనుమానంలో ఉన్నారట.
Advertisement
విషయం ఏదైనా ఎన్టీఆర్ తలచుకోగానే సినిమా చేయాలని భావించారు విడుదలైన ఆరు రోజుల్లోనే కోటి రూపాయలు లాంగ్ రన్ లో ఆరు కోట్ల రూపాయలను సంపాదించింది. దీనితో తమిళనాడులో విడుదల చేయాలనుకున్నారు అప్పటికి తెరమీద బొమ్మలు పాలన చేస్తాయి అన్నమాట ఎం.జి రామచంద్రన్ ఉదాహరణగా నిలిచారు. ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఆయన ఉన్నారు. అయితే ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసింది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సినిమాపై దృష్టి పెట్టారు.
Advertisement
Also read:
తమిళనాడులో ఈ మూవీని విడుదల చేయకూడదని ఆమె కంకణం కట్టుకున్నారు, సెన్సార్ జరగకుండా ఆ సినిమాను విడుదల అవ్వకుండా ఆపగలిగారు ఆ తర్వాత ఎన్నో రోజులు ఆపలేరు. కాబట్టి చివరికి సినిమా విడుదల అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నికైన విషయం మనకు తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసి తొమ్మిది నెలలకి ముఖ్యమంత్రి అయ్యారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!