Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, చాలా మంది ఆయన అభిమానులు సైతం ఈ సినిమాను ఓ రొటీన్ స్టోరీగా ఫీల్ అవుతున్నారు. అయితే.. ఓ అభిమాని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని ఉద్దేశించి బహిరంగ లేఖ రాసారు. కథలో కొత్తదనం లేకపోవడం.. రొటీన్ ఫార్ములాలోనే సినిమా నడుస్తుండడంతో అభిమానుల్లో కొంత నిరాశ అయితే ఉంది. అయితే.. ఈ వీరాభిమాని మాత్రం దాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు.
Advertisement
వీటిని చదవండి: ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలట.. హనుమాన్ కాకుండా మిగతా 11 ఏంటంటే?
ఇంతకీ ఆయన తన లేఖలో ఏమి రాసారో ఇప్పుడు చూద్దాం. “అన్నా.. అతడు, పోకిరి సినిమాలలో నువ్వు కుర్చీలో కూర్చునే స్టైల్ ను ఇప్పటికీ చాల మంది ఫాలో అవుతున్నారని నీకు తెలుసా, తెలియదా అన్నా? . నన్ను క్షమించు.. నువ్వు గతంలో చాలా సినిమా ప్రయోగాలే చేసావ్.. ఆరోజుల్లోనే నాని లాంటి సినిమా తీసి రికార్డ్స్ కొట్టావ్. టక్కరి దొంగ, వన్ నేనొక్కడినే, ఖలేజా లాంటి సినిమాలన్నీ అద్భుతమైన ప్రయోగాలే.
Advertisement
వీటిని చదవండి:‘హనుమాన్’ సినిమా ఇంతటి ఘన విజయానికి గల కారణాలు ఇవేనా ?
ఆ సినిమాలను ఇప్పటికీ ఇష్టపడుతూనే ఉంటా. నేను నా జీవితంలో అసలు చూడకూడదు అనే సినిమా ఒకటి ఉంది. అదే బ్రహ్మోత్సవం. ఇప్పుడు అదే జాబితాలో గుంటూరు కారం కూడా చేరింది. ప్రామిస్ గా చెప్తున్నా.. ఈ గుంటూరు కారం సినిమా చూడను. చూసి బాధపడలేను. మిగతా హీరోలంతా కాలానికి తగ్గట్లుగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటె.. నువ్వు మాత్రం ఎందుకన్నా ఈ ఓల్డ్ తరహా మూవీస్ నే చేస్తున్నావ్? అంటూ ఈ అభిమాని తన ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఈ లేఖని ఇక్కడ చూసేయచ్చు.
వీటిని చదవండి:Mahesh Babu: మహేష్ బాబు కి ఒక అభిమాని రాసిన ఓపెన్ లెటర్ ! అతని బాధలో నిజం ఉందా?