Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని చరిత్ర సృష్టించి ఎన్నో అవార్డుల పంట పండించారు రాజమౌళి. తాను దర్శకత్వం వహించిన RRR మూవీకి ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో త్రిబుల్ ఆర్ మూవీలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం ఒక చరిత్ర అని చెప్పవచ్చు.
also read; ‘కాంతారా’ సినిమాకి ‘విరూపాక్ష’ సినిమాకి ఉన్న ఉన్న లింక్ ఏంటో తెలుసా?
Advertisement
అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇక రాజమౌళి ఆయన భార్య రమా సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆనందంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆలింగణం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అవార్డు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా భారతీయులు మొత్తం లైవ్ లో చూస్తూ అవార్డు ప్రకటన వెలువడగానే ఆనందంతో ఎగిరి గంతేసారని చెప్పవచ్చు.
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 13.03. 2023
తెలుగు సినిమా పాట ఆస్కార్కు నామినేట్ కావడం అవార్డు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. దీంతో తెలుగు వాళ్లతో పాటు భారత సినీ అభిమానులంతా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆనందాన్ని పలు విధాలుగా వ్యక్తపరుస్తున్నారు.
Advertisement
also read: ‘కాంతారా’ సినిమాకి ‘విరూపాక్ష’ సినిమాకి ఉన్న ఉన్న లింక్ ఏంటో తెలుసా?