Advertisement
హైదరాబాద్ నగరంలో కూకట్ పల్లిలో భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ లులు మాల్ సెప్టెంబర్ 27న ఘనంగా ప్రారంభమైన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఆ మాల్ ప్రారంభం అయిందో లేదో.. వెంటనే నగర వాసులంతా ఒక్కసారిగా మాల్ లోకి వెళ్లారు. అక్కడ జనం పోటెత్తారు. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రధానంగా అక్టోబర్ 01న ఆదివారం కావడంతో ఈ మాల్ కి వేలాదిగా నగరవాసులు షాపింగ్ కి వచ్చారు. ముఖ్యంగా మాల్ లోపల, బయట చుట్టుపక్కల అంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఈ తరుణంలోనే కొంత మంది చేసిన పనులకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మహానగరం హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కూకట్ పల్లిలో లులు మాల్ నగర వాసులకు అతిపెద్ద షాపింగ్ స్పాట్ గా నిలుస్తోంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఇటీవలే ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మాల్ పై సోషల్ మీడియా తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలనుకుంటారు. దీనికి తోడు 3 రోజుల సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో లు లు మాల్ ని సందర్శిస్తున్నారు. ఈ మాల్ కి వచ్చే జనాల వల్ల కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సెప్టెంబర్ 30న 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ కాగా.. అక్టోబర్ 01 ఆదివారం వీకెండ్ కావడంతో మాల్ కి జనం ఒక్కసారిగా వేలాది సంఖ్యలో పోటెత్తారు.
ఇవి కూడా చదవండి : విడాకులు తీసుకున్న 6 మంది భారతీయ క్రికెటర్లు వీరే..!
మాల్ లోపల జనాలు నిండిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎక్కడ చూసినా జనాలే ఎస్కలేటర్లు, బిల్లింగ్ కౌంటర్లు.. ఇలా అన్నీ చోట్లలో జనాలతో మాల్ నిండిపోయింది. మాల్ అంతా ఇలా జనాలతో నిండిపోతే.. కొంత మంది ఇదే అదునుగా భావించి అందినకాడికి దోచుకున్నారు. ఆహార పదార్థాలను సీసీ కెమెరాల కళ్లు గప్పీ మరీ దోచేశారు. మాల్ లో ఉన్న ఆహార పదార్థాలన్నింటిని కస్టమర్లు తినేశారు. బిస్కెట్లు, సమోసాలు, ప్రూట్స్, కూల్ డ్రింక్స్ ఏది దొరికితే దానిని తినేశారు. కొంతమంది సగం తినేసి సగం మాల్ లో నచ్చినట్టు విసిరి పడేశారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ నగర వాసులు మన పరువును అంతర్జాతయ స్థాయిలో తీశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : జూనియర్ ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ గొప్పోడా..? తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!