Advertisement
క్రికెట్ ఆట ని చూడడానికి, ఆడదానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. అయితే సాహసంతో కూడిన ఆట ఇది. ఒక్కో సారి అది కాస్త ప్రమాదకరంగా మారుతుంది. పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని మీరు చూసే వుంటారు. కొలంబో రెండో టెస్టు లోనూ అలాంటిదే జరిగింది. కొలంబో వేదికగా ఆ మ్యాచ్ జరిగింది. ఇక వివరాలని చూస్తే.. శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో పాకిస్థాన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ అహ్మద్ ని ప్రమాదం లో పడేసాడు.
Advertisement
Advertisement
పాకిస్థాన్ ఇన్నింగ్స్ 81వ ఓవర్ లో బంతి విసిరితే. అదేమో హెల్మెట్‌కు తగిలింది. ఆ ఎఫెక్ట్ 5 ఓవర్ల తర్వాత అనగా 86వ ఓవర్‌లో కన్పించడం జరిగింది. సర్ఫరాజ్ అహ్మద్ బయటకి వచ్చేసాడు. 86 వ ఓవర్ ముగిసే సమయానికి సర్ఫరాజ్ అహ్మద్ తల తిరిగినట్టు చెప్పాడు. ఫిజియో మైదానానికి వచ్చి పరీక్షలు చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 22 బంతుల్లో 14 పరుగులలు తీసాడు. బంతి హెల్మెట్‌కు తగలడంతో సర్ఫరాజ్ తల వెనుక భాగానికి గాయం అయింది. విషయం మరీ సీరియస్‌గా లేదని తెలుస్తోంది. అన్నీ సవ్యంగా ఉంటే సర్ఫరాజ్ పాకిస్థాన్ తరపున మళ్లీ ఆడగలడు.
Also read: