Advertisement
టీ-20 వరల్డ్ కప్ సందర్భంగా మార్మోతున్న పేరు సూర్యకుమార్ యాదవ్. అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుండటమే దీనికి కారణంగా. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న సూర్య.. ప్రస్తుతం టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
Advertisement
సూర్య ఆటతీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఆటగాళ్లు ఇతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీలు సూర్య ఆట చూసి షాకవుతున్నారు. పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే.. సూర్య బ్యాటింగ్ దిగిన సమయంలో మైదానం నలుమూలలా బంతిని బాదుతున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. ఇతని ఆటకు ఫిదా అయిపోయాడు. సూర్యలాగా బ్యాటింగ్ చేయాలంటూ పాక్ క్రికెటర్లకు సైతం సలహాలు ఇస్తున్నాడు.
Advertisement
ఇక పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా సూర్యకుమార్ ఆటపై ప్రశంసలు కురిపించాడు. అతను వేరే గ్రహం నుంచి వచ్చాడని తాను అనుకుంటున్నానని.. ఏ గ్రహం నుంచి వచ్చావు? అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సూర్య చాలా డిఫరెంట్ అని… 2022లో టీ-20లో వెయ్యి పరుగులను సాధించిన ఏకైక క్రికెటర్ ఇతను మాత్రమేనని చెప్పాడు.
మొన్న జరిగిన జింబాబ్వే పైన మాత్రమే కాదు.. ప్రపంచంలోని టాప్ బౌలింగ్ అటాక్స్ పై సూర్య ఆడిన ఆట ఒక ట్రీట్ అని కితాబునిచ్చాడు అక్రమ్. అతని టాలెంట్ అమోఘమని.. ఏ మాత్రం భయం లేని బ్యాట్స్ మెన్ అని కొనియాడాడు. బంతి శరీరానికి తగిలినా లెక్కచేయని తత్వమని.. సూర్య ఆటను వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. అయితే.. పాక్ మాజీలు ఇలా సూర్యను ఆకాశానికెత్తేయడంపై సోషల్ మీడియాలో అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కూడా సెమీస్ చేరడంతో ఇరు జట్లు ఢీకొనే ఛాన్స్ ఉందని.. సూర్యకుమార్ డైవర్ట్ కాకుండా జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నారు.