Advertisement
ప్రస్తుత కాలంలో దేశాంతర ప్రేమలు, పెళ్లిళ్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. ప్రేమించిన వారి కోసం ఏం చేసేందుకైనా, ఎంతవరకు వెళ్లేందుకైనా సిద్ధపడుతున్నారు. నేటి యువతకి ఇవేమీ కొత్త కాదు. ఇలాంటి వాటికి కొన్ని కొన్ని సందర్భాలలో పెద్దలు అభ్యంతరం చెప్పినా కానీ పట్టించుకోరు. అచ్చం ఇలానే ఓ అపరప్రేమికుడు కూడా దేశం కానీ దేశానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. పాకిస్తాన్ కి చెందిన ఆ అమ్మాయి కూడా సరిహద్దులు దాటి వచ్చి మరి భారత యువకున్ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తరువాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్ రాజ్ కి చెందిన మూలయం సింగ్ యాదవ్ (21) బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో గార్డుగా పనిచేసేవారు. అయితే లాక్ డౌన్ సమయంలో ఆయన సమీర్ అన్సారి అనే పేరుతో ఆన్లైన్లో లూడో గేమ్ ఆడుతుండేవారు.
Advertisement
Read also: ఆ తెలుగు హీరో రిజెక్ట్ చేయడంతో ధనుష్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి
అలా పాకిస్తాన్ కి చెందిన ఇక్రా (19) తో ఆడారు. అలా వీరు రోజు లూడో గేమ్ ఆడుతున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక అదే సమయంలో ఇక్రాకి పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. ఆ విషయాన్ని ఆమె ములాయంతో చెప్పగా అతడు ఇండియా కి వచ్చేయమని ఆమెకు సూచించాడు. దీంతో ఇక్రా పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా తొలుత నేపాల్ చేరుకుంది. అక్కడ మూలయం ఆమెను కలుసుకున్నాడు. ఇక ఇద్దరూ 2002 సెప్టెంబరు లో నేపాల్ లోని ఓ ఆలయంలో వివాహం చేసుకొని అక్కడినుండి పాట్నా మీదుగా బెంగళూరు కి వచ్చారు. బెంగళూరులోని బెల్లందూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండసాగారు. అలా మూలయం ఉద్యోగం చేస్తుండగా ఇక్రా ఇంట్లోనే ఉండేది. ఇక్రాకి రియా యాదవ్ పేరుతో ఓ ఆధార్ కార్డు ని కూడా సంపాదించాడు ములాయం.
Advertisement
అలా కొన్నేళ్లు గడిచాక ఇక్రా పాకిస్తాన్ లో ఉన్న తన తల్లితో వాట్సాప్ కాల్ మాట్లాడడం ప్రారంభించింది. అయితే బెంగళూరులో నిర్వహించాల్సిన జి20 సన్నాహక సమావేశాలు, ఏరో షో నేపథ్యంలో అక్కడి పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే బెంగుళూరు నుంచి పాకిస్తాన్ కు వాట్సప్ కాల్స్ వెళుతున్నట్లు గుర్తించారు. ఆ కాల్స్ ఎక్కడి నుంచి వెళుతున్నాయో గుర్తించి ఇక్రా ని పట్టుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె అక్రమంగా భారత్ వచ్చినట్లు గుర్తించి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) కి అప్పగించారు. ఇక్రాను పంజాబ్ లోని అమృత్ సర్ కు తరలించి.. ఆ తర్వాత అక్కడి నుండి అట్టారీ బోర్డర్ నుంచి పాకిస్తాన్ కి తిరిగి పంపించారు. ఆమె భారత్ లోకి ప్రవేశించడానికి సహకరించడం, ఫోర్జరీ, ఐపీసీ లోని మరికొన్ని సెక్షన్ల కింద మూలయం సింగ్ యాదవ్ ను అరెస్టు చేశారు.
Read also: ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?