Advertisement
సొంత గడ్డలో బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి నిరాశలో పాకిస్తాన్ జట్టు ఉంది. అయితే ఇప్పుడు ఐసీసీ ఆ జట్టుకి షాక్ ఇచ్చింది. రావల్పిండి టెస్ట్ లో స్లో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పాయింట్లు కోత విధించింది. బంగ్లాదేశ్ పై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంది. ఆ జట్టు కూడా నిర్ణీత సమయంలోగా బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
Advertisement
నిర్ణీత సమయంలోగా ఏకంగా ఆరు ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఐసీసీ ఆరు పాయింట్ల కోత విధించింది. దీంతో ఇప్పటికే మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ సమయం బంగ్లాదేశ్ పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆ జట్టు కూడా నిర్ణీత సమయంలో నాలుగు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినందుకు నాలుగు పాయింట్లు కోత విధించింది.
Advertisement
Also read:
ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన షకీబ్ అల్ హసన్ పై కూడా ఐసీసీ చర్యలు చేపట్టింది. మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ కి సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన షకీబ్ అతనిపై బంతిని విసిరాడు. అది వెళ్లి కీపర్ చేతిలో పడింది. ఎంపైర్ కూడా ఈ విషయంపై మందలించాడు. ఐసీసీ చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 10% కోత విధించింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!