Advertisement
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా హీరో అయిపోయారు. వరుసగా సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఆయనకు భారీ హిట్లు లభించాలని కోరుకుంటున్నారు. రానున్న సినిమాలతో కూడా ప్రభాస్ పెద్ద హిట్ ని భారీ కలెక్షన్స్ ని రాబట్టాలని భావిస్తున్నారు. ప్రభాస్ పిరియాడిక్ డ్రామాగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు.
Advertisement
ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీలో సైనికుడుగా కనపడబోతున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా క్రేజీ వార్త అదేంటో తెలుసా..? ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఒక పాకిస్తానీ హీరోయిన్ నటించబోతోంది. ఈ మేరకు డైరెక్టర్ హను రాఘవపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి మామ్ చిత్రంలో నటించిన సాజన్ అలీ మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. సాజన్ కి అంతగా బాలీవుడ్లో అవకాశాలు అయితే రాలేదు.
Advertisement
Also read:
Also read:
కాని సోషల్ మీడియాలో ఈమె లుక్స్ ని చూసి యువత ఫిదా అవుతోంది. ఇంత అందంగా ఉన్న హీరోయిన్ ప్రభాస్ కోసం తీసుకురావాలని కెమిస్ట్రీ కూడా బాగుంటుందని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలని కూడా భావిస్తున్నారు అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనపడుతోంది. మరి ఏ హీరోయిన్ ని ఫిక్స్ చేస్తారని తెలిపాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!