Advertisement
పేలవ ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి అలాంటి ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు. శుక్రవారం భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో పంత్ 23 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఓపెనర్లు ధావన్ (72), శుభమన్ గిల్ (50) లు తొలి వికెట్ కు 124 పరుగులు జోడించి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన పంత్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ఫెర్గుసన్ బౌలింగ్ లో పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పంత్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంత్ కు ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని, ఇకనైనా టీం మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకుంటే జట్టుకు మంచిదని వాపోతున్నారు.
Advertisement
అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సంజు శాంసన్, వెంట వెంటనే టీమిండియా 4 వికెట్లు కోల్పోవడంతో, శ్రేయస్ అయ్యర్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి, టీమ్ ఇండియా 300 ప్లస్ పరుగులు చేయడంతో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ చెలరేగుతుంటే, యాంకర్ రోల్ ప్లే చేశాడు. ఇక టీమ్ ఇండియాకు చివరి ఓవర్లలో భారీ స్కోర్ అందించాల్సిన దశలో గేరు మార్చి భారీ షాట్ ఆడే క్రమంలో మిల్నే వేసిన ఇన్నింగ్స్ 45.4 బంతికి ఫిన్ అలెన్ చేతికి చిక్కాడు.
Advertisement
50 పూర్తి చేసుకునేలా కనిపించిన సంజు, భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కానీ, పరిస్థితులకు తగ్గట్టు ఆడి ఎంతో పరిణతి చూపించాడు. చాలా కాలంగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్ ఎట్టకేలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. మరోవైపు దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లోను ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 23 బంతులు ఆడిన పంత్ కేవలం 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకే మ్యాచ్ లో పంత్, శాంసన్ ఆటతీరును చూసిన క్రికెట్ అభిమానులు ఇకనైనా సెలక్టర్లు కళ్ళు తెరిస్తే మంచిదని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
read also :
1.పంత్ ఇకనైనా కొవ్వు తగ్గించుకో.. ధోనిని చూసి నేర్చుకో !
2001 కోల్కతా టెస్ట్ ఆస్ట్రేలియా తో గెలుపు లక్ష్మణ్, ద్రావిడ్ కాదు గంగూలీ ఎలాగంటే ?
T20 World Cup 2022: జింబాబ్వేపై గెలుపు, సెమీస్‍లోకి భారత్ ఎంట్రీ.. ఆ జట్టుతోనే ఫైట్