Advertisement
పావలా శ్యామల అందరికీ సుపరిచితమే చాలా సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎంతోమంది అగ్ర నాయకులతో కూడా ఆమె పనిచేసింది. పావలా శ్యామల అనారోగ్య సమస్యతో ప్రస్తుతం బాధపడుతోంది. పావలా శ్యామల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో చిరంజీవి రెండు లక్షల రూపాయలు పంపించి ఆమెని ఆదుకున్నారట. అలానే ఒకసారి పావలా శ్యామల ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది పైగా అనారోగ్య సమస్య కూడా ఉంది.
Advertisement
ఆ టైంలో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ అవుతోందట. ఈమె ఆరోగ్యం బాలేదట. ఆ సమస్య కారణంగా మందులు కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో ఆయన్ని కలవడానికి వెళ్లిందట. కానీ అక్కడ ఎవరు ఆయన్ని కలుసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆయన కోప్పడతారు. వెళ్ళిపోమని చెప్పేవారట. కానీ పావలా శ్యామల మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చేవరకు ఎదురుచూసి ఆయన్ని ఆఖరికి కలిసిందట. అనారోగ్య సమస్య వలన ఇబ్బంది పడుతున్నట్లు ఆర్థిక పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ కి చెప్పగా వెంటనే ఆయన 20000 రూపాయలు ఇచ్చి మందులు కొనుక్కోమని చెప్పారట. కార్ కూడా ఇచ్చి పంపించారట.
Advertisement
స్వయంగా పావలా శ్యామల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు అతనితో పెద్దగా పరిచయం లేకపోయినా ఆయన నాకు సహాయం చేశారని పావలా శ్యామల చెప్పుకొచ్చారు. పావలా శ్యామల మనసంతా నువ్వే, ఆంధ్రవాలా, గోలిమార్, ఖడ్గం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మత్తు వదలరా సినిమాలో ఆఖరిగా ఆమె కనపడ్డారు. కానీ ఆ సినిమా తర్వాత మళ్లీ పావలా శ్యామలా కనపడలేదు. ఆర్థిక పరిస్థితులు వలన తన కూతురుతో పాటు హైదరాబాదులోని వృద్ధాశ్రమంలో ఆమె ఉంటోంది.