Advertisement
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘనవిజయాన్ని సాధించాకా కుటుంబం ఆశీస్సులు అందుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి చిరంజీవి, రామ్ చరణ్, కొణిదెల సురేఖ అంజనాదేవి ఘన స్వాగతం పలికారు. జనసేన ని సాధించిన విజయాన్ని అందరూ ఆశీర్వదిస్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్కరూ పవర్ స్టార్ ను చూసి పొంగిపోయారు. చిరంజీవి ఇంటికి భార్య అన్నా లేజోనోవా కొడుకు అకీరాతో కలిసి పవన్ కళ్యాణ్ వచ్చారు. మెగా నివాసంలో జరిగిన సంబరాల్లో పవన్ కళ్యాణ్ సతీమణి చేసిన పని అందరినీ ఆకట్టుకుంటుంది. భర్త మీద ఆమెకి ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా తెలిసింది ఐదేళ్లుగా వైయస్ జగన్ తో పాటు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై నీచాతి నీచంగా చిల్లర రాజకీయాలు చేశారు.
Advertisement
Pawan Kalyan, Ram Charan and Anna Lezhneva in Chiranjeevi House Celebrations
నాలుగు పెళ్లిళ్లు అని పవన్ పై ఎప్పుడూ కూడా జగన్ విమర్శలు చేస్తూ ఉన్నారు. మూడవ భార్యకు విడాకులు ఇస్తున్నట్లు జగన్ పరోక్షంగా విమర్శలు చేసి నాలుగు భార్యలు అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికలు జరిగినప్పటి నుండి భార్య అన్నా ని వెంటబెట్టుకుని ఓటు వేసి అలాంటి విమర్శలకు సమాధానాన్ని చెప్పారు. భార్య కొడుకుతో కలిసి ఆయన అనేక సందర్భాల్లో కలిసి కనపడ్డారు. అంతేకాకుండా ఢిల్లీలో కలిసిన సమయంలో కూడా కుటుంబ సభ్యుల్ని ఆయనకు పరిచయం చేశారు.
Advertisement
Also read:
Pawan Kalyan, Ram Charan and Anna Lezhneva in Chiranjeevi House Celebrations
దీంతో వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలకు బ్రేక్ వేశారు. భార్య తో కలిసి గురువారం చిరంజీవి నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ ఫ్యామిలీకి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇలాంటి సంఘటనల మధ్య తన భర్త మీద తనకున్న ప్రేమని భక్తిని ఆమె చాటుకుంది. పవన్ వెంట నడుస్తూ.. తన భర్త చెప్పులు మోస్తూ ఇంట్లోకి వచ్చారు. పవన్ అన్న మధ్య ప్రేమాభిమానులకు ఇది సాక్ష్యంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించే వాళ్ళందరికీ ఇలా సమాధానం ఇచ్చారు అని అభిమానులు అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!