Advertisement
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా చేయడంతో పాటుగా వైసీపీ 11 స్థానాలకి మాత్రమే పరిమితం అయ్యేలా చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ అండ లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదని చంద్రబాబు నాయుడు స్వయంగా ఒప్పుకున్నారు. పవన్ పవర్ ఏంటో అందరికీ ఇలా అర్థమైంది. ఏది ఏమైతేనేమి వైసీపీని ఓడించాలని లక్ష్యంతో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేసారు.
Advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అన్నా ఆయన ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసి సరదా పడ్డారు. పవన్ ముఖ్యమంత్రి పదవి తీసుకునే విషయంలో ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో పెద్ద చిక్కే వచ్చింది.
Advertisement
Also read:
Also read:
ఒక పక్క పదవి ఇంకో పక్క సినిమాలు రెండిటినీ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకున్నారు. పైగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండాలి. అభిమానుల్ని డిసప్పాయింట్ చేయకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు అలాగే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు విషయంలో పవన్ కళ్యాణ్ సరిగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!