Advertisement
ఎట్టకేలకు ప్రధాని మోడీని కలిశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. దాదాపు 8 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిశారు. ఆ తర్వాత ఇప్పుడే ఈ కలయిక జరిగింది. ఏపీ పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ విశాఖకు వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని రోడ్ షో నిర్వహించారు. పీఎంకు వెల్ కమ్ చెప్పేందుకు జనం భారీగా తరలివచ్చారు. మోడీ, మోడీ, భారత్ మాతాకీ జై నినాదాలతో వీధులు మార్మోగాయి.
Advertisement
ఈస్ట్రన్ నావల్ కమాండ్ లోని ఐఎన్‌ఎస్ చోళాలో ప్రధాని మోడీకి బస ఏర్పాటు చేశారు. అక్కడే నాయకుల్ని ఆయన కలుస్తున్నారు. ముందుగా జనసేనానితో సమావేశమయ్యారు పవన్. షెడ్యూల్ ప్రకారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం పవన్ తో సమావేశం ఉండాలి. కానీ, వర్షం కారణంగా ప్రధాని పర్యటన ఆలస్యం కావడంతో.. ఆ సమావేశం కంటే ముందే పవన్ తో భేటీ అయ్యారు.
Advertisement
ఈ భేటీకి వపన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధాని-పవన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పైగా.. భేటీ అనంతరం పవన్ కూడా మీటింగ్ విషయాల్ని సస్పెన్స్ లోనే ఉంచారు.
‘‘రెండు రోజుల క్రితం పీఎంవో నుంచి కాల్ వచ్చింది. 8 ఏళ్ల తర్వాత మోడీని కలవడం ఇదే తొలిసారి. ఆయనతో నా సమావేశం రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తుంది. రాష్ట్రం బాగుండాలనేదే ప్రధాని ఆకాంక్ష. ప్రత్యేక పరిస్థితుల్లో మా ఇద్దరి సమావేశం జరిగింది. తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలనేది మోడీ ఆకాంక్ష. ప్రధాని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మా సమావేశంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా’’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.