Advertisement
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఇవాళ మరో సంచలనానికి తెర తీశారు. వైసీపీ నేతలను చెప్పులతో కొడతానంటూ సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఇవాళ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో తన కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటే… చెప్పు లేపి మరి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
Advertisement
వైసీపీ గుండాగాళ్లు పద్దతిగా మాట్లాడితే పద్దతే.. లేకుంటే చెప్పుతో కొడదామని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ డిబేట్సుకు వెళ్లండి.. ఏమైనా తేడాగా మాట్లాడితే పబ్లిక్కుగా బాదేయండన్నారు పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంటే విశాఖ వాళ్లకు ఎందుకు కోపం రావడం లేదు… కార్మికుల్లారా..! మీరు కదలిరండి.. నేను నిలబడతానని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నేను అడ్డంగా నిలబడతా.. అవసరమైతే ప్రాణాలిస్తానని వెల్లడించారు.
Advertisement
పటేల్ తర్వాత అత్యంత బలమైన అమిత్ షా తో నేను ప్రైవేట్ స్టీవ్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంటుకు గనులు ఎందుకు కేటాయించరు..? అని నిలదీశారు. జిందాల్ స్టీలుకు ప్రైవేట్ గనులు ఉండగా లేనిది విశాఖ స్టీల్ ప్లాంటుకి ఎందుకు ఉండకూడదన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర గురించి వైసీపీ సన్నాసులకేం తెలుసు… ఈ నేల మీద నాకు ప్రేమ ఉందని అగ్రహించారు. కోనసీమలో వాళ్ల మంత్రి ఇల్లు వాళ్లే తగలెట్టేసి.. చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ అని.. పోలీసులంటే మాకు కోపం లేదు.. గౌరవం అని చెప్పారు. రేపు పోలీసులు మా గొడుగు కిందే పని చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
read also : బిజెపితో బంధం తెంచుకున్న పవన్ కళ్యాణ్ !
చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతా కొడకల్లారా…- Pawan Kalyan #PawanKalyan #YCP #JanaSena #NTVTelugu #NTVNews pic.twitter.com/cnGwqTW40U
— NTV Telugu (@NtvTeluguLive) October 18, 2022