Advertisement
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలను ఉద్దేశించి, జనసేనాని ఆవేశానికి గురయ్యారు. ఇవాళ ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రజలంతా నిత్య చైతన్య మూర్తులై పోరాడాలన్నారు. తెలుగు జాతి ఉనికి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం పొట్టి శ్రీరాముల ప్రాణార్పణతో ఏపీ అవతరించిందని వెల్లడించారు.
Advertisement
ఆంధ్రుల్లో ఎలాంటి చైతన్యం కోసం అమరజీవి తపించారో ఆ చైతన్యం ఇప్పుడేమైంది..? అని ప్రశ్నించారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా ప్రజల్లో ఎందుకు స్పందన కరవైందని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నా ఎందుకీ మౌనమన్నారు. ప్రజలకు పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా ఎందుకు ప్రశ్నించరు? అని నిలదీశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
Advertisement
ఏ లక్ష్యం కోసం ఏపీ అవతరించిందో ఒక్కసారి మననం చేసుకోవాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తున్నానని చెప్పారు. అక్రమార్కులు పాలన చేస్తుంటే చేష్టలుడిగి ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామని వెల్లడించారు. ఈ పర్వదినాన బాధ్యతాయుతమైన పౌరులందరూ ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లేలా కార్యాచరణతో ముందుకు సాగాలి.. గళమెత్తాలన్నారు. ఓటును ఆయుధంగా మలచాలి.
ఆంధ్రప్రదేశ్ ను మన దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
read also : ఈటల రాజేందర్ అత్తగారి ఊరిలో హత్యకు కుట్రలు ?