Advertisement
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాాహి యాత్ర ఉభయగోదావరి జిల్లాలలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ ప్రభంజనంలో ఆయన మాట్లాడిన మాటలు యువతతో పాటు, సామాన్య ప్రజానికాన్ని ఈ సారి ప్రత్యేకంగా ఆకర్షించాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా అన్నవరంలో పూజల దగ్గర నుంచి భీమవరంలో అడుగుపెట్టే వరకు కూడా ఉసికేస్తే రాలనంత జనం రావడంతో జనసేన నుంచి మంచి జోష్ లో ఉంది. రాజకీయ ప్రసంగంతో ప్రారంభంలో విమర్శలు చేసిన పవన్ కాకినాడలోని సర్పవరం జంక్షన్ నుంచి రీకాల్ అనే కొత్త పదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇక ఆ తరువాత పవన్ మాట్లాడిన ప్రతీ సభలో కూడా రీకాల్ మాట వినిపిస్తోంది. వాస్తవానికి రీకాల్ అంటే అర్థం వెనక్కి తీసుకోవడం.
Advertisement
పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రకారం.. చూసినట్టయితే ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి బాగా పని చేయకపోతే అతడిని ప్రజలే వెనక్కి పిలిపించి పదవీ నుంచి దింపేయడమన్నమాట. ఓ తమిళ సినిమాలో మమ్ముట్టి సీఎం గా ఉండి సభలో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. వాస్తవానికి సినిమాలో సక్సెస్ సాధించిన ఈ రీకాల్ పదం నిజజీవితం సాధ్యమవుతుందా..? మరీ ఈ పదాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు చెబుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం.. ఐదేళ్ల పాటు పదవీలో ఉంటారు. ఈ ఐదేళ్లలో అతనికి పదవీ పోవడం అంటే పదవీ దక్కించుకున్న వ్యక్తి స్వయంగా రాజీనామా చేయడం కానీ.. మరణించడం ద్వారా పదవీ పోవడం ఒక్కటే మార్గం.. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఒక ఎమ్మెల్యేగా, లేదా ఎంపీగా గెలవాలంటే.. కచ్చితంగా అదృష్టం ఉండాలి. చాలా మంది ఎన్నో ఏళ్లో నుంచి ఆ పదవుల కోసం ఎదురుచూసినా కొంత మందికి మాత్రం దక్కవు.
Advertisement
పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కూడా కాలేదు. అలాంటప్పుడు అంత కష్టపడి పదవీ దక్కించుకుంటే.. ఆ పదవీని రీకాల్ చేయడం సాధ్యమా అన్నది ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తున్న మాట. కేవలం ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ప్రజల కోసం పాటు పడుతామని బలంగా చెప్పేందుకు పవన్ కళ్యాణ్ ఈ రీకాల్ మాటను తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతుంది. పవన్ మాటల్లో రీకాల్ వినిపించినా.. బాహ్య ప్రపంచంలో రీకాల్ అసాధ్యం అన్నది రాజకీయ నిపుణుల మాట. రాజోలు నుంచి జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొంది వైసీపీలో కొనసాగుతున్నారు. పవన్ తన మాటల్లో రాపాక వరప్రసాద్ ని రీకాల్ చేయాలంటున్నారు. కేవలం పవన్ అనాలోచిత మాటలా.. లేక రాజకీయ వ్యూహమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ.. పవన్ రీకాల్ ప్రభావం చూపుతుందా లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కలలో ఇలాంటి మహిళలు కనిపించినట్టయితే మీ దశ మారినట్టే.. ఎవరంటే..?
ఈసారి హైదరాబాద్‌లో మూడే మ్యాచ్లు, 2 పాకిస్తాన్‌వే.. ఎందుకు వరల్డ్ కప్ మ్యాచులు పెట్టలేదు అంటే..?