Advertisement
తులా రాశి & మకర రాశి 2022:మానవునికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య శాస్త్రం గొప్పది. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు, పాటించేవారు చాలా ఎక్కువమందే ఉంటారు. ఒక వ్యక్తి జన్మించిన తేదీ, సమయం, ప్రదేశం.. ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం, అతడి భవిష్యత్తు సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు చూపించే విద్య జ్యోతిష్యం. అయితే ప్రస్తుత కాలంలో డబ్బులకు ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బులు లేకపోతే ఏ పనులు జరగవు అనడంలో ఏలాంటి సందేహం లేదు. అయితే కొందరు వ్యక్తులు ఎంత కష్టపడినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము సంపాదించిన సొమ్మును ఆదా చేయడంలో విఫలమౌతూ ఉంటారు. శని దేవుని ప్రభావం వల్ల జీవితకాలం ఆర్థిక సమస్యలు లేకుండా జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా శని దేవుని ప్రభావం పడితే నష్టాల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు శుభస్థానంలో ఉన్న రాశుల వారిలో మంచి ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవునికి ఇష్టమైన కొన్ని రాశుల గురించి చెప్పబడింది. శని వారి పట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Read also: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు
Advertisement
1) తులా రాశి 2022
తులా రాశికి అధిపతి శుక్రుడు. ఇది శనికి మిత్రగ్రహం. అందువల్ల తులా రాశి వారికి శని దేవుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందువల్ల వీరు మంచి ఫలితాలను పొందుతారని, వీరి జీవితంలో కష్టపడి పనులు చేస్తే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అంటున్నారు. కాబట్టి వీరు శనీశ్వరునికి ప్రతిరోజు పూజ చేయాలని తెలియజేస్తున్నారు.
2) మకర రాశి 2022.
ఈ రాశి వారికి శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు. కావున ఈ రాశి వారికి జీవితాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శని గ్రహ ప్రభావం వల్ల మకర రాశి వారు నిరుపేదలకు సేవ చేస్తారు. మీరు ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతం అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశి వారు కొంచెం కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ వ్యక్తుల జీవితంలో ఆనందంతో పాటు గౌరవాన్ని కూడా పొందుతారు.
Read also: ఇల్లు మారేటప్పుడు ముందుగా ఈ వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలి