Advertisement
తాజాగా విడుదలైన కాంతారా సినిమా భాష,ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుని రికార్డులు తిరగ రాస్తూ ముందుకు పోతోంది.. ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో ఆ విధంగానే వివాదాల్లో కూడా ఇరుక్కుంటుంది. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. ఇప్పటికే 215 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తున్న ఈ చిత్రంపై తమ కళా రూపం, భూత, కోలను ఈచిత్రంలో తప్పుగా చూపారని తుళు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం కథ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలో తుళు భాష మాట్లాడే ప్రజలు ఏటా ఆత్మలు లేదా దేవతలు కలిసే ఒక జానపద సంప్రదాయమే భూత కోలా..
Advertisement
also read:ఈ 10 మంది టాప్ టాలీవుడ్ గాయకుల ఫ్యామిలీల ఫోటోలు చూశారా !
Advertisement
ఇందులో వారు పూర్వీకులను భూతాలు లేదా దైవాలుగా ఆరాధించే సాంప్రదాయం. ఈ వేడుకలో భూతాలకు ప్రతిబింబాలుగా నిలిచే విగ్రహాలను తీసుకొని డప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు. దీని వల్ల ఊహించని కొన్ని శక్తుల నుంచి ఈ ఆత్మలు గ్రామాన్ని రక్షిస్తాయన్నది వారి నమ్మకం. అయితే భూత కోల అనేది హిందూ సంప్రదాయంలో భాగమని ఈ చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి చెప్పడం వివాదంగా మారింది. వరాహరూపం పాటలో వరాహాన్ని మహావిష్ణువు అవతారంగా చూపడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఈ విధంగా అనేక వివాదాలు చుట్టుముడుతున్న సందర్భంలో మరో వివాదం బయటకు వచ్చింది..
పింగారా కాపీయే కాంతారా..?
ఇన్ని వివాదాలు చుట్టుముట్టిన వేళ 2019 లో వచ్చిన తుళు చిత్రం పింగారాకి కాపీ అనే మాటలు వినిపిస్తున్నాయి. పింగారా చిత్రానికి ఉత్తమ తుళు సినిమాగా కూడా అవార్డు వచ్చింది. ఇందులో కూడా ఆత్మ ఆరాధన లేదా దైవారాధన ఇతివృత్తంతో సినిమా సాగింది. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంవల్ల సినిమా పెద్దగా గుర్తింపు సాధించలేదు. అయితే ఈ కథను కాపీ కొట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కాంతారా పేరుతో రిషబ్ శెట్టి ఈ సినిమా తీశారని వార్తలు వస్తున్నాయి. ఇన్ని వివాదాల మధ్య ఈ సినిమా మాత్రం మరింత క్రేజ్ పెంచుకొని దూసుకుపోతోంది.
also read:మరో 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి !