Advertisement
గుజరాత్ లో బీజేపీ గెలుపు చాలా ముఖ్యం. ఓడిపోతే మాత్రం సార్వత్రిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుంది. ప్రధాని సొంత రాష్ట్రంలోనే పార్టీ ఓడిపోయిందని ప్రతిపక్షాలు హేళన చేసే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే.. సర్వేలన్నీ బీజేపీ వైపే ఉన్నాయి. మరోమారు గుజరాత్ లో కాషాయ జెండా ఎగురుతుందని ఆయా సంస్థలు ప్రకటన చేశాయి. రెండు దశల్లో ఎన్నికలకు ప్లాన్ చేసి నిర్వహించింది ఈసీ.
Advertisement
మొదటి దశలో మొత్తం 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో దశలో 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే.. రెండో దశ ఎన్నికల్లో ప్రధాని మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Advertisement
అహ్మదాబాద్ లోని రణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేశారు మోడీ. ప్రత్యేక భద్రత మధ్య ఓటింగ్ కేంద్రానికి చేరున్న ఆయన.. తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. సామాన్య ఓటరుగానే మిగతా వారి మధ్య క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు.
ప్రధానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేసినట్టు.. తన వేలికి పెట్టిన సిరాను చూపించారు మోడీ. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అహ్మదాబాద్ లో ఓటు వేశాను.. రికార్డు స్థాయిలో అందరూ ఓటేయాలని కామెంట్ పెట్టారు.
రెండో దశ కోసం 14,975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1.13 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ నారన్ పురాలోని ఏఎంసీ సబ్ జోనల్ ఆఫీస్ లో ఓటు వేశారు.ఆయన కుమారుడు, బీసీసీఐ సెక్రెటరీ జై షాతో పాటు ఇతర కుటుంబసభ్యులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.