• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఇంగ్లీష్ పై మోడీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఇంగ్లీష్ పై మోడీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Published on October 19, 2022 by sasira

Advertisement

ఓవైపు హిందీ భాషపై రచ్చ నడుస్తున్న ఈ సమయంలో ఇంగ్లీష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. దేశంలో స్థానిక భాషల వినియోగాన్ని సమర్ధించారు. ఇంగ్లీష్ అనేది కేవలం సమాచార మాధ్యమం మాత్రమేనన్నారు. ఇంగ్లీషు మాట్లాడినంత మాత్రాన మేధావులైనట్టు కాదని చెప్పారు. పేద తల్లిదండ్రుల పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకోకపోయినా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంగ్లీష్ భాష లేకపోవడం వల్ల ఎవరూ వెనుకబడకుండా చూడాలని మోడీ అన్నారు.

Advertisement

దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. అందువల్లే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు మోడీ. ఇది వరకు ఆంగ్ల భాష మాట్లాడితే అదో పెద్ద మేధావితత్వానికి బెంచ్ మార్క్ గా పరిగణించేవారని, నిజానికి అది ‘మీడియం ఆఫ్ కమ్యూనికేషన్’ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ఇంగ్లీష్ అవరోధంగా ఉందని, గ్రామాల నుంచి చాలా మంది ప్రతిభావంతులు అది రాని కారణంగా వైద్యులు, ఇంజనీర్లు కాలేకపోతున్నారని తెలిపారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం ఆంగ్ల భాష చుట్టూ ఉన్న ఈ బానిస మనస్తత్వం నుండి దేశాన్ని బయటకు తెస్తుందన్నారు. అలాగే దేశంలో కొత్తగా ప్రారంభించిన 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను తర్వాతి స్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు. 5జీ సేవ స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్‌ రూమ్‌ లు, స్మార్ట్ బోధనలకు మించి ఉంటుందన్నారు. ఇది మన విద్యా వ్యవస్థను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని తెలిపారు ప్రధాని.

Related posts:

రెస్టారెంట్ లు GST బిల్లులు పేరుతో మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో తెలుసా ? జగన్ ను కప్పతో పోల్చిన ప్రముఖ సింగర్! Competition between Chandrababu and Jagan for good relations with BJPమోడీతో హాయ్ హాయ్..! chamkeela-angelesi“చమ్కీల అంగిలేసి” సాంగ్ స్టెప్స్ తో అద్దరగొట్టిన అమ్మాయి ! కీ

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd