Advertisement
కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగింది. టీడీపీ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మరో వైపు హిందూపురం ఎమ్మెల్యే, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా సినిమా పనులను తగ్గించుకుని పాలిటిక్స్ పై ఫోకస్ చేసారు. ఇది ఇలా ఉంటె.. ఆయన కూతురు నారా బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి వస్తారని టాక్ వినిపిస్తోంది.
Advertisement
ఈ క్రమంలో ఆమె చంద్రబాబు అరెస్ట్ పై మీడియా సమావేశంలో కూడా స్పందించారు. ఆమె మాటలకు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో పోసాని చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 17 సార్లు స్టే తెచ్చుకున్నారని.. ఆయన తప్పు చేయడం వలనే అరెస్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు.
Advertisement
ఆయన చేసిన స్కామ్ లో భాగంగా జైలుకి వెళ్లి, ఏడాది శిక్ష అనుభవించి బయటకు వచ్చినా నేను సంతోషిస్తానని అన్నారు. ఆయనకు దోమలు కుట్టకుండా దోమ తెరలు, ఏసీలు నేనే పంపిస్తానని అన్నారు. ఇక నారా బ్రాహ్మణి గురించి మాట్లాడుతూ.. ఆమె మాటలు వింటుంటే నవ్వు వస్తోందని అన్నారు. నేను అడిగిన ప్రశ్నలకు నారా బ్రాహ్మణి సమాధానం చెప్పాలని అన్నారు. మీ తాతగారు ఎన్టీరామారావు ను చంపింది ఎవరు? మీ తాతగారిని వెన్నుపోటు పొడిచింది ఎవరు? మీ తాతగారిని చెప్పుతో కొట్టింది ఎవరో చెప్పాలని బ్రాహ్మణికి ప్రశ్నలు సంధించారు. అవినీతి పనులు చేస్తే జైలుకే పోతారని పోసాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారాయి.
మరిన్ని..
సీఎం జగన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు కారణం ఏంటో తెలుసా ?
విజయ్ ఆంటోనీ గారు చేసిన ఆ చిన్న పొరపాటు వల్లనే కూతురు దూరమయ్యారా?