Advertisement
లడ్డు కల్తీ వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.తిరుమల లడ్డు వివాదం పై హిందూ సంఘాలు శ్రీవారి భక్తులందరూ వైసీపీ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ విషయం ఇప్పుడు బయటికి వస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ఈ వివాదం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచులన కామెంట్స్ చేశారు. దానికి కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ గురించి చూద్దాం.
Advertisement
Advertisement
”తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆలయ కమిటీ చేసిన ద్రోహం. అలాగే పెద్ద పాపం అని అన్నారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని నిందితుల్ని అరెస్ట్ చేయండి ఈ విషయంలో హిందువులు తీవ్రంగా హర్ట్ అయ్యారు” అని హిందూ ఐటి విభాగం నుంచి వచ్చిన ట్వీట్ కి ”తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వును వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిటిడి బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా నిర్మూలించాలి” అని పవన్ కళ్యాణ్ స్పందించారు.
దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ ప్రస్తుతం లడ్డు వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు దయచేసి విచారణ జరపండి ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి కఠినంగా శిక్షించండి. అంతే కానీ ప్రజల్లో భయాందోళనలను పెంచి దీన్ని జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు ఇప్పటికే దేశంలో మతపరమైన ఉద్రిక్తలు చాలానే ఉన్నాయి అని పేర్కొన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి !