Advertisement
గత వైసీపీ ప్రభుత్వం లో వైయస్ జగన్ కి అనుకూలంగా వ్యవహరించి కష్టాలు కొని తెచ్చుకున్న అధికారుల లిస్టులో రిటైర్డ్ ఐఏఎస్ కి హైకోర్టు నెల రోజులు జైలు శిక్ష విధించింది. ఆదేశాలు అమలు చేయకుండా వక్రభాష్యాలు చెప్పి ఉత్తర్వులు పక్కన పెట్టిన వ్యవహారంలో ఆయనతో పాటుగా ఇంకో అధికారికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇప్పుడు సంచలనాన్ని రేపుతోంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ అప్పట్లో జగన్ కి వీరవిజయుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరు చెప్తే చాలు నిబంధనలతో సంబంధం లేకుండా పని చేస్తారని విమర్శలు ఎదుర్కొన్నారు.
Advertisement
ఈ క్రమంలో 2022లో ఇంటర్ బోర్డులో విజయలక్ష్మి అనే ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయ్యారు అంతకుముందే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు. దీంతో సర్వీస్ పొడిగించాలని ఆమె కోరారు హైకోర్టును ఆశ్రయించారు. సర్వీస్ పొడిగించాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. కానీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న శేషగిరిరావు ఆదేశాలను అమలు చేయలేదు.
Advertisement
Also read:
దీంతో ఆమె పిటీషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు వీరి వాదన తప్పని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు అని స్పష్టం చేసింది. ప్రవీణ్ ప్రకాష్, శేషగిరి బాబుకు నెల రోజులు జైలు రెండువేల చొప్పున జరిమానా విధించింది. ఇప్పటికే విఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ తో పాటు శేషగిరి బాబుకు అపీల్ చేసుకునేందుకు వీలుగా నాలుగు వరాలపాటు శిక్షణ శిక్షణ వాయిదా వేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!