Advertisement
హిందువులు మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి శివుడుని ఆరాధిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు వీటిని సమర్పిస్తే శివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈసారి మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తులు ఆ రోజున ఎంతో పవిత్రంగా ఉంటూ శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి నాడు ఏమేమి ఆచరించాలి..? ఎలా దేవుడుని ఆరాధించాలి అనేది చూద్దాం. భక్తులు అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా వరాలు ఇచ్చే శివుడుని మహాదేవుడని భోళా శంకరుడు అని పిలుస్తాము. పరమశివుని భక్తులు ప్రతిరోజూ పూజిస్తారు. మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి మీరు కూడా ఎదురు చూస్తున్నారా..? అయితే ఎలా శివుడ్ని ఆరాధించాలి..? ఎలా మంచి జరుగుతుంది అనేది చూద్దాం.
Advertisement
Advertisement
మహా శివుడు కంఠంలో విషాన్ని దాచుకుంటారు. దీంతో ఆయన నిత్యం వేడి తో ఉంటారు ఆయనని చల్ల పరచడానికి నిత్యం అభిషేకం చేస్తారు అయితే దేవతలు ఉమ్మెత్త ని సమర్పించి చల్లబరిచారని అంటారు. ఉమ్మెత్త పువ్వులని శివుడికి సమర్పించి శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శివుడు అలంకారానికి దూరంగా ఉంటారు ప్రకృతిలో లభించే పూలు పత్రాలు ఆయనకు చాలా ఇష్టం. వీటిలో బిల్వపత్రాలు అంటే శివుడికి ఎంతో ప్రీతి మహాశివరాత్రి నాడు బిల్వపత్రాలతో శివుని ఆరాధించండి. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది.
శివుడికి జలాభిషేకంతో పాటుగా క్షీరాభిషేకం చేయటం కూడా మంచిది. తేనే అభిషేకం చేయడం కూడా మంచిదని పండితులు అంటున్నారు ప్రకృతిలో లభించే ఎలాంటి కల్తీ లేని తేనే ని శివుడికి సమర్పించండి మీ కోరికలు తీరుతాయి. దోషం పోవడానికి చాలామంది జమ్మి మొక్కని ఇంట్లోకి తెచ్చుకుంటారు. జమ్మిని శని దేవుడికి సమర్పించడం వలన దుఃఖాలు పోతాయి. మహాశివరాత్రి నాడు జమ్మి ఆకుల్ని శివుడికి సమర్పిస్తే చాలా మంచిది కుంకుమపువ్వును శివుడికి సమర్పిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుందట. కాబట్టి శివుని అనుగ్రహాన్ని పొందాలంటే కచ్చితంగా ఇలా శివుడిని ఆరాధించండి. మీ కోరికలు నెరవేరుతాయి శివుడి ఆశీస్సులు లభిస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!