Advertisement
ఇటీవల ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల థీమ్స్ లో వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా.. ఈ ట్రెండ్ ను ఓ పోలీస్ జంట ఫాలో అయ్యింది. వారి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ను పోలీస్ స్టేషన్ లో తీసుకున్నారు. ఈ ప్రీ-వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ను చూసిన తెలంగాణ సీపీ చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వెడ్డింగ్ వీడియోను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో తీశారు. కొన్ని దృశ్యాలు పోలీస్ వాహనాలపైనా, కొన్ని షూట్ లలో పోలీస్ యూనిఫామ్ లతోనే తీశారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.
Advertisement
మరి కొందరు మాత్రం వీరిని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు పోలీసులు ప్రేమించుకుని ఓ జంటగా మారారు అంటూ మరికొందరు తమ సంతోషాన్ని కామెంట్స్ లో తెలియచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కె భావన మరియు అదే స్టేషన్ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్‌ఐ ఆర్ కిషోర్ లు ఆగష్టు 26 వ తేదీన వివాహం జరిగింది. పెళ్ళికి ముందు వీరిద్దరూ కలిసి స్టేషన్ పరిధిలో ప్రీ-వెడ్డింగ్ వీడియో ను షూట్ చేయించుకున్నారు. ఈ వీడియోలో కొన్ని సన్నివేశాలను పోలీస్ స్టేషన్ ఆవరణలో తీయడం, పోలీస్ వాహనాలను ఉపయోగించడంతో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
Advertisement
దీనిపై తాజాగా హైదరాబాద్ సిపి ఆనంద్ స్పందించారు. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదని.. వారు వివాహం చేసుకోబోతున్నందుకు ఉద్వేగంగా ఉన్నారని తెలిపారు. అయితే.. ఇలా ఫోటో షూట్ చేసుకోవడానికి అనుమతి అడగాలని.. వారు అడిగి ఉంటె కచ్చితంగా అనుమతి ఇచ్చేవాళ్లమని ఆనంద్ తెలిపారు. వారు పిలవకపోయినా.. వారిని కలిసి ఆశీర్వదించాలని అనుకుంటున్నానని అన్నారు. పోలీసింగ్ అనేది చాల అకష్టమైన విషయమని.. ముఖ్యంగా మహిళలకు మరింత కష్టం అని చెప్పుకొచ్చారు. ఒకేచోట పని చేసే వారిద్దరూ జంట కావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.
మరిన్ని..
విజయ్ ఆంటోనీ కూతురు మరణం లో దిమ్మ తిరిగే ట్విస్ట్ ! తెరపైకి కొత్త వ్యక్తి అదెవరంటే ??
విజయ్ ఆంటోనీ తన కూతురుతో చివరగా మాట్లాడిన మాటలు ఇవే.. ఏమన్నారంటే?