Advertisement
Premalu Review & Rating: నస్లేన్ కే గఫూర్,మమిత బైజు,శ్యామ్ మోహన్,సంగీత్ ప్రతాప్ ఈ మూవీ లో నటించారు. ఈ సినిమా కి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ప్రేమకి, సినిమాకి భాషతో సంబంధం లేదు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. అలాంటి ఓ సినిమా ఈ ‘ప్రేమలు’. ఈ మూవీ మలయాళంలో నెల రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి భ్రమయుగం కి ఈ సినిమా గట్టి పోటీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ లవ్ ఎంటర్‌టైనర్‌కి అంతా కనెక్ట్ అయ్యిపోతున్నారు. సోషల్ మీడియా లో కూడా ఈ ప్రేమలు హవానే నడుస్తోంది. చిన్న సినిమా అయినా యూత్‌కి కనెక్ట్ అయింది.
Advertisement
నటులు:నస్లేన్ కే గఫూర్,మమిత బైజు,శ్యామ్ మోహన్,సంగీత్ ప్రతాప్
దర్శకుడు: గిరీశ్ ఏడీ
సినిమా శైలి: మలయాళం, రొమాంటిక్ కామెడీ
వ్యవధి:2 Hrs 36 Min
రిలీజ్ డేట్: మార్చి 4, 2024
కథ మరియు వివరణ:
Advertisement
హైదరాబాద్‌లో ఐటీ జాబ్ చేసే ఇద్దరు అమ్మాయిలకి గేట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు కుర్రాళ్లకి మధ్య నడిచే లవ్ స్టోరీ ఈ ప్రేమలు. లైఫ్ లో ఎప్పుడూ లవ్ లో సక్సెస్ అవ్వని కుర్రాడు (సచిన్) అలానే లైఫ్‌పై పుల్ క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి (రీనూ) ని లవ్ చెయ్యడం మొదలు పెడతాడు. ప్రేమ లో ఫుల్ పడతాడు. కేవలం తనతో ఉండటం కోసమే హైదరాబాద్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ యూకే వెళ్లాలని తన కల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళు ఒక పెళ్లిలో కలిసి స్నేహితులుగా మారతారు. ఆ తర్వాత తన లవ్ మేటర్‌ని రీనూ కి సచిన్ చెప్పడంతో స్టోరీ మారుతుంది. ఆఫీసులో రీనూని ఆది అనే మరో అబ్బాయి తెగ లవ్ చేస్తూ ఉంటాడు. వీళ్ల ముగ్గురి మధ్య క్లైమాక్స్ వరకూ స్టోరీ నడుస్తూ ఉంటుంది. మంచి జాబ్, బాగా సెటిలైన అబ్బాయి కోసం చూస్తుంది రీనూ. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా ఉన్న సచిన్‌కి దగ్గరవుతూ ఉంటుంది. చివరికి సచిన్ ప్రేమ గెలిచిందా? ఏమైందో తెలియాలంటే మూవీ చూడాలి.
ఈ సినిమాలో లీడ్ పెయిర్ బాగా ఆకట్టుకున్నారు. నటీనటులు నటనకి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. స్టోరీ కూడా బాగుంది. స్టార్టింగ్ లో సినిమా కొంత దాకా ట్రాక్ మీదకి రాకపోవడంతో ఆడియన్స్ కి బోరింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ ఇంకా బాగా మొదలు పెట్టి ఉండవచ్చు. ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్ గా ఉండొచ్చు. మొత్తం మీద సినిమా అయితే అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. అందరూ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతుంది.
ప్లస్ పాయింట్స్:
నటీ నటులు
కథ
మైనస్ పాయింట్స్:
సినిమా బిగినింగ్
ఫస్ట్ హాఫ్
రేటింగ్: 3.5/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!