Advertisement
పెళ్లి అనేది ఓ మధురమైన అనుభూతి. అయితే వివాహం అనేది తగిన వయసులో జరిగితేనే దానికి అర్థం ఉంటుంది. కానీ చాలామంది ఏజ్ బార్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే అనేక ఇబ్బందులు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
READ ALSO : వరసకు అన్న చెల్లెల బంధం ! కానీ పెళ్లి చేసుకున్నారు .. అసలు విషయం తెలిసాక ఏమయ్యిందంటే ?
30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది వారి కెరియర్ పై దృష్టి పెట్టి సంసారాలను పట్టించుకోవడం లేదు. దీంతో వీరిని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి సమస్యలు తప్పడం లేదట. ఎన్నో కలలు కంటూ మీ జీవితంలోకి వచ్చిన సదరు అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదగడం కోసమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ విధంగా చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామికి అనుమానాలు అపార్ధాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లడం చాలా చూస్తున్నాం.
Advertisement
కానీ వివాహ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలనైనా తట్టుకోవాల్సిందే. దీనికోసం భార్యాభర్తలు ఇద్దరు సమన్వయం పాటించి ఉంటేనే సంసార జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే వారి మధ్య ఆకర్షణ తగ్గి అనేక అనుమానాలకు బీజం పడుతుంది. ఈ తరుణంలో సఖ్యతగా ఉండేందుకు ఒకరికి ఒకరు దాపరికాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అప్పుడే సంసార జీవితం ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే. కానీ డబ్బుతో పాటుగా జీవిత భాగస్వామి ప్రేమను కూడా పట్టించుకోవాలి. అప్పుడే సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది.