Advertisement
తన భార్య కోసం ఆ భర్త చాలా తిప్పలు పడ్డాడు. అప్పు చేసి మరీ ఆమెని చదివించాడు. ఆమె మాత్రం తన చదువు పూర్తి చేసుకుని నర్స్ అయ్యాక ఆ భర్తకి తీరని వేదనని మిగిల్చింది. భర్త చేత అప్పు చేయించి చదువుకున్న ఆమె ఉద్యోగం రాగానే ప్రియుడితో వెళ్ళిపోయింది. దీనితో ఆ భర్త ఆమె గురించి పోలీసులకు కంప్లైంట్ చేసాడు.
Advertisement
వీటిని కూడా చదవండి: అలా ఎలా లాజిక్ మిస్ అయ్యారు సర్ ? “వీరసింహరెడ్డి” లోని ఈ సీన్స్ లో డైరెక్టర్ చేసిన తప్పుని గమనించారా ?
నర్సుగా మారిన ఆ మహిళ పేరు ప్రియా కుమారి. ప్రియా భర్త చదువు కోసం అప్పు తీసుకున్నాడు. అప్పు చేసి నర్సింగ్ విద్యను అందించింది. అయితే ప్రియా తన భర్తను మోసం చేసింది. ఆమె దిల్కుష్ రౌత్ అనే ప్రేమికుడితో కలిసి పారిపోయింది. జ్యోతి మౌర్య తరహాలోనే ఈ ఘటన గొడ్డ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమించి పారిపోయిన ప్రియా అక్కడితో ఆగలేదు. పెళ్లి చేసుకుని రెండో భర్తతో ఉన్న ఫోటోలను తన మొదటి భర్తకి, కుటుంబ సభ్యులకు పంపించింది.
Advertisement
వీటిని కూడా చదవండి: అలాంటివారు పెళ్లికి రావద్దు.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు..!!
దీనితో తాను మోసపోయానని గుర్తించిన భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఆగ్రహించిన అతడు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, మోసం చేసిన భార్య చదువు కోసం వెచ్చించిన లక్షల రూపాయలను తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరుతున్నాడు. ప్రియా భర్త పేరు టింకు కుమార్. అతను 2020లో ప్రియను వివాహం చేసుకున్నాడు. ఆమెకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమె ఆసక్తిని గమనించిన టింకూ ఆమెను నర్సింగ్ కాలేజీలో చేర్పించాడు. ఇందుకోసం రెండున్నర లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. సెప్టెంబర్ 19న ఇంటి నుంచి పారిపోయిన ప్రియా ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పెళ్లి చేసుకుంది.
మరిన్ని..
అలాంటివారు పెళ్లికి రావద్దు.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు..!!
ఆ పత్రాలే చంద్ర బాబు భవిష్యత్తు ని తేల్చేది..? ఎందుకు అంటే..?