Advertisement
నటసింహా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అంటే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసేది అందులోని పంచ్ డైలాగుల కోసమేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా బాలకృష్ణ ” వీర సింహారెడ్డి” చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ రెండు వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నిర్మాతలు నవీన్ యుర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.
Advertisement
Read also: చిరంజీవి మాస్టర్ సినిమాలోని హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఈ చిత్రంలోని పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సాధించింది. అయితే ఈ మూవీలోని ఓ పంచ్ డైలాగ్ ని రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టారని నెటిజెన్లు, నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. ” సినిమాలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు, మందు తరాలు నాకిచ్చిన బాధ్యత, నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్..!” అంటూ బాలయ్య చెప్పిన ఈ భారీ డైలాగ్ వినడానికి చాలా బాగుంది.
Advertisement
ఈ డైలాగ్ ని ట్రైలర్ లో కూడా పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాపై హైప్ పెరగడానికి ఈ డైలాగ్ కూడా కారణమని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ మొదలైనప్పుడు రావలసిన ఈ డైలాగ్ ని ఎక్కడో చివర్లో ఇరికించడం బాలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో విలన్ తండ్రితో ఫైట్ చేసే సమయంలో బాలయ్య.. ” రేపటి తరం కూడా నీ చావుని కోరుకుంటుంది ” అంటూ విలన్ కు తనను పరిచయం చేసుకుంటాడు. ఆ సమయంలో ఈ ట్రైలర్ లో ఉన్న డైలాగ్ పెడితే బాగుండేదని.. కానీ చివర్లో చిన బాలయ్య వద్ద ఇరికించారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
Read also: అప్పుడు తొడ కొడితే ట్రైన్ వెనక్కి, ఇప్పుడు వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!
https://telugu.filmyfocus.com/why-did-waste-a-good-dialogue-in-veera-simha-reddy-movie