Advertisement
భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. నిర్మాతల నష్టాలు తప్పలేదు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోలుకోలేనంత నష్టం తెచ్చి పెట్టినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలైన చార్మి, పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం పంపిణీ మొదలుపెట్టినట్టు కొన్ని కథనాలు కూడా వచ్చాయి.
Advertisement
అయితే తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆడియో ప్రకారం పూరీ, చార్మి ఇంకా వారికి నష్టపరిహారం చెల్లించలేదట.తాజా కథనాల ప్రకారం డిష్ట్రిబ్యూటర్లు కొంతమంది చార్మిని నష్టపరిహారం కోసం డిమాండ్ చేయగా, పూరి పేరుకు మచ్చ తెచ్చేలా ప్రయత్నిస్తున్న కొందరు డిస్ట్రిబ్యూటర్ల పై సీరియస్ అయిందని టాక్ నడుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు తమకు కొంత సమయం కావాలని అడిగినట్టు ఆడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు పూరి.
Advertisement
‘మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? నేను ఎవరికీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకు ఇస్తున్న, పాపం వాళ్లు కూడా నష్టపోయారని సానుభూతితో మాత్రమే తిరిగి ఇవ్వాలనుకుంటున్న. కొంత మొత్తాన్ని ఒక నెలలో ఇస్తానని ఇప్పటికే బయ్యర్లతో మాట్లాడాను. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్లను ఒక నెల టైం అడిగాను. నాకు కూడా రావాల్సి ఉంది. ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే, ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. మేము ఎందుకు ఇస్తున్నాం, పరువు కోసం ఇస్తున్నాం. కానీ నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అయినా ఎగ్జిబిటర్స్ కు నాకు సంబంధం ఏంటి’ అంటూ పూరి స్టైల్ లో సాగుతున్న వార్నింగ్ వాయిస్ కాల్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Read also: వన్డే క్రికెట్ లో 10 ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు వీరే!